Site icon NTV Telugu

Game Changer : దసరాకు మాస్ సాంగ్ తో ఫుల్ ట్రీట్ ఇవ్వనున్న చిత్ర యూనిట్..?

Whatsapp Image 2023 10 17 At 3.33.02 Pm

Whatsapp Image 2023 10 17 At 3.33.02 Pm

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్‌ఛేంజర్.. ఈ సినిమాను కొలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభం అయి చాలా రోజులవుతుంది. దీనితో సినిమా నుంచి అప్‌డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తోన్న అభిమానులకు దసరాకు సినిమా యూనిట్ గుడ్‌న్యూస్ చెప్పబోతున్నారు..ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను దసరా సందర్భంగా అక్టోబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే వెలువడనుందని సమాచారం.. పక్కా మాస్ ట్యూన్‌తో చరణ్ ఫ్యాన్స్‌లో ఊపు తెప్పించేలా ఫస్ట్ సింగిల్ ఉండనున్నట్లు సమాచారం.ఈ సాంగ్‌ రికార్డింగ్ పనులతో మ్యూజిక్ డైరెక్టర్‌ థమన్ బిజీగా ఉన్నట్లు తెలిసింది. గేమ్ ఛేంజర్ సినిమాను శంకర్ పాన్ ఇండియన్ లెవెల్‌లో దాదాపు 200 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్నాడు.గేమ్‌ఛేంజర్ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.

శంకర్ తన గత సినిమాల తరహాలోనే సామాజిక కథంశానికి కమర్షియల్ హంగులను మేళవించి ఈసినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.. ఇందులో రామ్‌చరణ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.డ్యూయల్ షేడ్స్‌లో అతడి క్యారెక్టర్ సాగనున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. వినయవిధేయ రామ తర్వాత రామ్‌చరణ్‌, కియారా అద్వానీ మరోసారి జంటగా నటిస్తున్నారు.. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, అంజలి, నవీన్‌చంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.రామ్‌చరణ్‌తో పాటు ప్రధాన తారాగణంపై శంకర్ ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తోన్నట్లు సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో గేమ్‌ఛేంజర్ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతోన్నాయి. అలాగే శంకర్ గేమ్ చేంజర్ సినిమాతో పాటు కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమాను కూడా తెరకేక్కిస్తున్నాడు. శంకర్ ఇండియన్ 2 సినిమాను 2024 ఆగస్టు 15 న విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Exit mobile version