Game Changer : గేమ్ చేంజర్ సాంగ్ లీక్.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్.. రాంచరణ్ 15 వ సినిమా గా వస్తున్న ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ రాంచరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్అందిస్తున్నారు..ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ “జరగండి జరగండి” పాట ను దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ లోపే ఈ సాంగ్ ఆన్లైన్ లో లీకైంది.లీక్స్ జరుగకుండా మేకర్స్ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఈ సాంగ్ లీక్‌పై మేకర్స్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లీక్ పై దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
సైబర్ క్రైమ్స్ డివిజన్ ఏసీపీ చంద్రభాషా, ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, ఎస్ఐ ప్రసేన్ రెడ్డి మరియు ఎస్ఐ సాయితేజ శ్రీ బృందం భవిష్యత్తు లో పైరసీ ఘటనలు జరగకుండా హెచ్చరికల ను జారీ చేశారు.గేమ్ ఛేంజర్ సినిమా లో రాంచరణ్ డ్యుయల్ రోల్ లో కనిపించనున్నట్టు సమాచారం..పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ మూవీలో తెలుగు నటి అంజలి మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా లో బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్ విలన్‌గా నటిస్తున్నారు.అలాగే ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాయ్ మరియు సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. గేమ్ ఛేంజర్ కు పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథను అందించారు.. సాయిమాధవ్ బుర్రా ఈ సినిమా కు డైలాగ్స్ అందిస్తున్నారు.గేమ్ చేంజర్ సినిమా త్వరలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
Also Read
- Municipal Elections: కర్నూల్ జిల్లాలో పోటెత్తిన ఓటర్లు.. రాష్ట్రవ్యాప్తంగా 3 గంటల సమయానికి 48.03 శాతం ఓటింగ్ నమోదు..
- YS Jagan: ఓటు వేయకుండానే వెనుదిరిగిన మాజీ సీఎం జగన్.. పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..
- CM Chandrababu: గతంలో ఎన్నడూ లేనంతటి స్ఫూర్తి కనిపిస్తోంది.. స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్..
- Punjab: పంజాబ్ ఆప్‌లో అసంతృప్తి సెగ.. పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా!
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Prabhas Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లోకి ప్రభాస్ రీ-ఎంట్రీ.. వైరల్ అవుతున్న షూటింగ్ అప్డేట్!
-
Municipal Elections: కర్నూల్ జిల్లాలో పోటెత్తిన ఓటర్లు.. రాష్ట్రవ్యాప్తంగా 3 గంటల సమయానికి 48.03 శాతం ఓటింగ్ నమోదు..
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
YS Jagan: ఓటు వేయకుండానే వెనుదిరిగిన మాజీ సీఎం జగన్.. పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..
-
RC 17 షురూ.. చిరంజీవి చేతుల మీదుగా చరణ్ కొత్త సినిమా ప్రారంభం!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!