NTV Telugu Site icon

Game Changer : ‘గేమ్ చేంజర్ ‘ రిలీజ్ డేట్ ఫిక్స్?..శంకర్ ప్లాన్ మాములుగా లేదు…

Game Changer

Game Changer

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘గేమ్ చేంజర్ ‘.. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ గత మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటూనే వస్తుంది.. కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమా విడుదల కూడా వాయిదా పడుతూ వస్తుంది.. సినిమాను ముందుగానే రిలీజ్ చెయ్యాలనే ప్లాన్ లో శంకర్ ఉన్నారు.. అందుకే సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు మేకర్స్.. మే నెలకు సినిమాను పూర్తి మిగితా పనులను మొదలు పెట్టాలానే ఆలోచనలో ఉన్నారు మేకర్స్..

ఈ ఏడాదిలో స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా విడుదల కాబోతున్నాయి.. దాదాపు అన్ని సినిమాలు తమ రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్నాయి. వీటి మధ్యలో గేమ్ ఛేంజర్ ఎప్పుడు వస్తుంది..? అసలు ఈ ఏడాది వస్తుందా లేదా..? అని టెన్షన్ ఫ్యాన్స్ లో మొదలైంది.. అయితే ఇప్పుడు వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. ఈ ఏడాది దీపావళీ కానుకగా అక్టోబర్ 31న సినిమాను రిలీజ్ చెయ్యాడానికి శంకర్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్..

అంతేకాదు ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నారని సమాచారం.. ఈ వార్త విన్న ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు.. సినిమాను ఎప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో నటిస్తున్నారు.. ఇక శ్రీకాంత్, సునీల్, అంజలి.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు..

Show comments