NTV Telugu Site icon

Game Changer : దట్ ఈజ్ పవర్ ఆఫ్ రామ్ చరణ్.. అక్కడ ‘గేమ్ ఛేంజర్’ ఆల్‌టైమ్ రికార్డు

New Project (87)

New Project (87)

Game Changer :మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లోకి ఈ రోజు వచ్చేసింది. మెగా అభిమానులకు సంక్రాంతి జనవరి 10నాడే మొదలైంది. మావెరిక్ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని సాలిడ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించారు. అయితే చరణ్ నుంచి ఆర్ఆర్ఆర్, ఆచార్య తర్వాత వస్తున్న సోలో సినిమా ఇది కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇపుడు మన తెలుగు హీరోలు హిందీ మార్కెట్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. వారిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు.

Read Also:Kangana Ranaut : మంచి దర్శకుడు అంటూ భూమ్మీద ఎవ్వరు లేరు : కంగనా రనౌత్

ఇక ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఇప్పటికే భారీగా బుక్కైన సంగతి తెలిసిందే. దీనిని బట్టే ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఉన్నారన్న సంగతి అర్థం అవుతుంది. అయితే, ఈ సినిమా టికెట్ బుకింగ్స్ నెల్లూరు సిటీలో ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. ‘గేమ్ ఛేంజర్’ మూవీ డే 1 ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. 103 షోలకు గాను రూ.1.15 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దీంతో ‘గేమ్ ఛేంజర్’ మూవీ క్రేజ్ ఏమిటో అందరికీ అర్థమవుతోంది. ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా ఎస్.జె.సూర్య విలన్ పాతరలో నటించారు. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించారు.

Read Also: Harsh Goenka: వారానికి 90 రోజుల పనా?.. సండేను సన్‌-డ్యూటీగా మార్చుతారా..!