NTV Telugu Site icon

Game Changer : గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్ మొదలయ్యేది అప్పుడేనా..?

Whatsapp Image 2023 09 17 At 8.42.45 Pm

Whatsapp Image 2023 09 17 At 8.42.45 Pm

గ్లోబల్ స్టార్ రాంచరణ్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్‌ ఛేంజర్‌. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ అప్‌డేట్‌ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది.రాంచరణ్ 15 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ రాంచరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది., అలాగే హీరోయిన్ అంజలి కూడా ముఖ్య పాత్రలో నటిస్తుంది.. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ అప్‌డేట్‌ ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది.కొన్ని రోజులపాటు ప్లాన్ చేసిన గేమ్‌ ఛేంజర్‌ కొత్త షెడ్యూల్ వచ్చే వారంలో షురూ కానున్నట్టు తెలుస్తుంది.. రాంచరణ్‌తోపాటు మిగతా స్టార్ క్యాస్ట్ తో వచ్చే టాకీ పార్ట్‌ను ఈ షెడ్యూల్‌లో పూర్తి చేయాలని ఫిక్సయినట్టు సమాచారం..

ఈ షెడ్యూల్ గురించి శంకర్‌ టీం త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేయనుంది.మొత్తానికి వేగంగా షూటింగ్‌ పూర్తి చేస్తూ.. అభిమానులకు వరుస ప్రమోషనల్‌ అప్‌డేట్స్‌ ఇచ్చేందుకు రాంచరణ్‌ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్‌ విలన్‌గా నటిస్తున్నారు… అలాగే ఎస్‌జే సూర్య, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌, సముద్రఖని, జయరాయ్‌, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.. గేమ్‌ ఛేంజర్‌ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు కథను అందించారు. అలాగే సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు.తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు..గేమ్‌ ఛేంజర్‌ లో కొన్ని కీలక సన్నివేశాలను కొన్ని రోజుల క్రితం స్టంట్ మాస్టర్‌ అన్బరివ్‌ నేతృత్వంలో మైక్రోబాట్‌ కెమెరాతో యాక్షన్‌ సీక్వెన్స్ షూట్‌ను పూర్తి చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

Show comments