Site icon NTV Telugu

Game Changer : రూమర్లకు చెక్.. “గేమ్ ఛేంజర్” కర్ణాటక బుకింగ్స్ స్టార్ట్

Game Changer Teaser

Game Changer Teaser

Game Changer : మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. మరో రెండ్రోజుల్లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లోకి రాబోతుంది. జనవరి 10న మెగా ఫ్యాన్స్‌కు అసలు సిసలైన సంక్రాంతి పండుగ మొదలు కానుంది. ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ నుంచి జరగండి, రా మచ్చా, నానా హైరానా, డోప్ సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అవగా.. చార్ట్ బస్టర్స్ అయ్యాయి. తమన్ ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే.. లక్నోలో అట్టహాసంగా టీజర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సినిమా ఓపెనింగ్స్‌ను డిసైడ్ చేసే బుక్సింగ్ స్టార్ట్ అయ్యాయి.

Read Also:Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?

తాజాగా ఏపిలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు రియల్ గేమ్ ఛేంజర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిన్ని మొన్నటి వరకు సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ బుకింగ్స్ మొదలు కాలేదంటూ జరుగుతున్న ప్రచారానికి మేకర్స్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ సినిమా బుకింగ్స్ ని ఒకో భాషలో విడుదల చేస్తూ వస్తున్నారు. ఇలా లేటెస్ట్ గా కన్నడ వెర్షన్ లో బుకింగ్స్ ని స్టార్ట్ చేసినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఆల్రెడీ బెంగళూరు కొన్ని ప్రాంతాల్లో ముందే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ ఇపుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా కర్ణాటకలో బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు తెలుస్తోంది. మరి అక్కడ ఈ సినిమాకి ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో చూడాలి. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. మరో కీలక పాత్రలో అంజలి కనిపించనుంది.

Read Also:KTR: ఇదొక లొట్టపీసు కేసు.. 2001లో ఉన్న ఇబ్బందులతో పోలిస్తే ఇదేంత..

Exit mobile version