NTV Telugu Site icon

Game Changer : జరగండి జరగండి.. ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ వచ్చేనండి..

Jaragandi Song

Jaragandi Song

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో రాబోతున్న పొలిటికల్ డ్రామా మూవీ గేమ్ చేంజర్.. ఈ సినిమా నుంచి మరో అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.. త్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. శంకర్ సినిమాలు అంటే రెస్పాన్స్ మాములుగా ఉండదు.. గత మూడేళ్లుగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. కానీ మేకర్స్ ను విడుదలపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు..

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మాత్రం సినిమా పై హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.. నేడు రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా సాంగ్ ను రిలీజ్ చెయ్యబోతున్నట్లు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.. తాజాగా సాంగ్ ను రిలీజ్ చేశారు.. జరగండి జరగండి.. ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ వచ్చేనండి..సాంగ్ లిరిక్స్ అదిరిపోయాయి.. శంకర్ మార్క్ కనిపించింది.. ఊహించినదానికంటే సూపర్ గా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.. థమన్ మ్యూజిక్ అదిరిపోయిందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు..ఈ పాటని అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాయగా, డాలర్ మెహెన్ది, సునిధి చౌహన్ పాట పాడారు. ప్రభుదేవా డాన్స్ కోరియోగ్రఫీ చేసారు.. మొత్తానికి ఈ సాంగ్ విడుదలైన కొన్ని నిమిషాలకే యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది..

ఇక ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించునున్నారు.. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ ఏడాది అక్టోబర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు రావాలని టీమ్ యోచిస్తుంది.. మరి అప్పుడన్నా విడుదల అవుతుంది.. మళ్లీ వాయిదా పడుతుందో చూడాలి.. ఇక రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.. అలాగే సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 2 సినిమాను చేయబోతున్నాడు..
Jaragandi - Lyrical Video | Game Changer | Ram Charan | Kiara Advani | Shankar | Thaman S