NTV Telugu Site icon

Karnataka: బీజేపీ గూటికి గాలి జనార్థన్ రెడ్డి.. కమలం పార్టీలో కేఆర్‌పీపీ విలీనం..

Gali

Gali

లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌ రెడ్డి ఇవాళ కమలం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో జనార్థన్‌ రెడ్డితో పాటు ఆయన భార్య కూడా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప సమక్షంలో గాలి జనార్ధన్‌ రెడ్డి తన పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్‌పీపీ)ని బీజేపీలో విలీనం చేసినట్లు ప్రకటించారు.

Read Also: D. Sridhar Babu: తెలంగాణ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు.. జులై నుంచి పంపిణీ..!

ఇక, గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. కేఆర్‌పీపీ పార్టీని బీజేపీలో విలీనం చేశానన్నారు. నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిని చేసేందుకు ఒక బీజేపీ కార్యకర్తగా తాను పని చేస్తానని చెప్పుకొచ్చారు. ఎలాంటి షరతులు, ఎలాంటి పదవులు అవసరం లేదని పేర్కొన్నారు. అనంతరం, మాజీ సీఎం యడియూరప్ప మాట్లాడుతూ.. గాలి జనార్దన్ రెడ్డి, ఆయన భార్య బీజేపీలో జాయిన్ అయ్యారని తెలిపారు. ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు.. జనార్దన్‌ రెడ్డి చేరిక బీజేపీని మరింత బలపరుస్తుంది.. రాష్ట్రంలోని మొత్తం 28 లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తామని మాజీ సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కల్యాణ కర్ణాటక ప్రాంతానికి చెందిన కీలక నేతలు, గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also: Rishi Sunak : మూడవ ప్రపంచ యుద్ధం.. అణు పరిశ్రమలో భారీగా పెట్టుబడులు పెట్టనున్న బ్రిటన్

అయితే, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర ఓటమిని చవిచూసింది. బంపర్ మెజారిటీ సాధించిన కాంగ్రెస్ రాష్ట్రంలో బీజేపీ నుంచి అధికారాన్ని దక్కించుకుంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోరు సరికాదని బీజేపీ అనుకుంటుంది. అందులో భాగంగా ఇప్పటికే మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడకు చెందిన జేడీఎస్ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోగా.. ఇప్పుడు కల్యాణ కర్ణాటక ప్రాంతంపై మంచి పట్టు కలిగిన గాలి జనార్దన్ రెడ్డిని బీజేపీలో చేర్చుకుంది. దీంతో ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ఉన్న రెడ్డి, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ఓట్లను తమ వైపు తిప్పుకునేలా బీజేపీ ప్లాన్ చేసింది.