విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన గామి సినిమా మహా శివరాత్రి సందర్భంగా గతేడాది మార్చి8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాందిని చౌదరి, అభినయ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాను క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మించాలని మొదలు పెట్టారు. 40 శాతం షూటింగ్ అయ్యాక సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ టేకప్ చేసి మంచి బడ్జెట్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డామ్ 2025కు “గామి” ఎంపికైంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. కాగా.. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరుగుతుంది. ఈ గౌరవం దక్కడంతో సినిమా యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.
READ MORE: PM Modi: ఇది ప్రజల బడ్జెట్.. పొదుపు, పెట్టుబడుల్ని పెంచుతుంది..
గామి కథ ఏంటి..
హరిద్వార్ లోని ఒక ఆశ్రమంలో అఘోరగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు శంకర్ (విశ్వక్ సేన్). అతనికి ఒక వింత జబ్బు ఉంటుంది. దాని వలన వేరే మనిషి అతనిని ముట్టుకుంటే అతని శరీరం అంతా రంగు మారిపోయి చనిపోతాడేమో అనేంతలా ఇబ్బంది పడతాడు. అతనిది జబ్బు కాదు శాపం అని చెబుతూ ఇతర అఘోరాలు ఆశ్రమ పెద్దకు ఫిర్యాదు చేస్తారు. అతన్ని ఇక్కడ ఉంచుకోవడం వల్లే మన ఆశ్రమానికి శుభం కలగడం లేదని చెప్పడంతో అతన్ని ఆశ్రమం నుంచి వెలివేస్తారు. అయితే ఈ సమస్యకు హిమాలయాలలో దొరికే మాలి పత్రాలు అనే ఒక రకమైన పుట్టగొడుగులతో పరిష్కారం దొరుకుతుందని అదే అవసరమానికి చెందిన సుధామ (జాన్ కొట్టోలీ) చెబుతాడు. ఈ క్రమంలో అతనికి జాహ్నవి(చాందినీ చౌదరి) ఆ పత్రాలను వెతికేందుకు సహాయపడుతుంది. అయితే వాటిని శంకర్ దక్కించుకున్నాడా? వాటి వల్ల తనకు ఏర్పడిన సమస్యను ఎలా క్లియర్ చేసుకున్నాడు? శంకర్ కి ఊహల్లో కనిపిస్తూ తమని కాపాడమని అడిగి ఉమ( హారిక), CT 333 ( మహ్మద్ సమద్), దేవదాసి దుర్గ(అభినయ) ఎవరు? వారికి శంకర్ కి అసలు సంబంధం ఏమిటి? అనే సందేహాలు నివృత్తి కావాలంటే ఈ సినిమాను చూడాల్సిందే..