Site icon NTV Telugu

National Security Advisory Council: “జాతీయ భద్రతా సలహా మండలి” సభ్యుడిగా జి. సతీష్ రెడ్డి..

G. Satheesh Reddy

G. Satheesh Reddy

కేంద్ర ప్రభుత్వం “జాతీయ భద్రతా సలహా మండలి” సభ్యుడిగా జి. సతీష్ రెడ్డిని నియమించింది. ఈ రోజు నుంచి రెండేళ్ళ పాటు “జాతీయ భద్రతా సలహా మండలి” సభ్యుడిగా జి. సతీష్ రెడ్డి కొనసాగనున్నారు. నియామక ఉత్తర్వులను కేంద్రం జారీ చేసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో జాతీయ భద్రతా సలహా మండలి పనిచేయనున్నది. డాక్టర్ జి. సతీశ్‌రెడ్డి భారత ప్రభుత్వం డీ.ఆర్.డీ.ఓ. (భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) మాజీ చైర్మన్‌. భారత రక్షణమంత్రి సాంకేతిక సలహాదారు. 2025 మార్చి 19న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయననను విమానయానం, రక్షణ రంగాలలో గౌరవసలహాదారుగా నియమించింది. ఆయన రాష్ట్ర క్యాబినెట్ హోదాలో రెండేళ్ళపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.

Exit mobile version