NTV Telugu Site icon

G. Chinna Reddy : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఇంజనీరింగ్, లా కాలేజీలు

Chinnareddy

Chinnareddy

G. Chinna Reddy : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో ఇంజనీరింగ్ , లా కాలేజీలకు మంజూరైనున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల విద్యాభివృద్ధి కోసం ఈ జిల్లాకు చాలా మేలు చేకూరుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విద్యా రంగంలో చాలా వెనుకబడిందని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యా ప్రగతికి దోహదం చేస్తుందని చెప్పారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రివర్గ సహచరులకు చిన్నారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

Mahesh Babu: కృష్ణుడిగా మహేష్ అంటూ వార్తలు.. మేనల్లుడు బహిరంగ క్షమాపణ

పాలమూరు జిల్లా విద్యా పరంగా వెనుకబడిన ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఆయన స్వంత నియోజకవర్గం కొడంగల్‌లో ఇటీవల పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్, డిగ్రీ , జూనియర్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు. అలాగే, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఏర్పాటు కోసం శ్రమిస్తున్నారు. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో త్వరలో లా , ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు.

India Russia: ఇండియన్స్‌కి గుడ్ న్యూస్.. వీసా లేకుండా రష్యాకు వెళ్లొచ్చు..