Site icon NTV Telugu

Future Forward : గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, IBM సంయుక్తంగా “Future Forward” అకడమిక్ ప్రోగ్రామ్ ప్రారంభం

Ibm

Ibm

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టెక్నాలజీ ఆధారిత విద్యాభివృద్ధికి రాజమహేంద్రవరం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) మరియు IBM Innovation Center for Education (ICE) కలిసి “Future Forward” అనే ఇండస్ట్రీ-అలైండ్ అకడమిక్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాయి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నది.

మే 19, 2025న జీజీయూ క్యాంపస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్స్‌లర్ డా. యు. చంద్ర శేఖర్, ప్రో వైస్ ఛాన్స్‌లర్ డా. కె. విజయ భాస్కర రాజు, ప్రో ఛాన్స్‌లర్ శ్రీ శశి కిరణ్ వర్మ, IBM ICE బిజినెస్ డెవలప్‌మెంట్ అండ్ క్లయింట్ రిలేషన్‌షిప్ లీడర్ శ్రీ హరి రామ సుబ్రహ్మణియన్, IBM ICE డెలివరీ హెడ్ శ్రీ వికార్ ఉద్దీన్ సూర్కీ, మరియు ది ఫన్నెల్ స్టోరీ ఫౌండర్ శ్రీ సుమంత్ పాల్గొన్నారు.

కార్యక్రమం దీప ప్రదర్శనతో ప్రారంభమై, అథితులు స్ఫూర్తిదాయక ప్రసంగాలు ఇచ్చారు. డా. చంద్ర శేఖర్ ఈ భాగస్వామ్యాన్ని విద్యా రంగాన్ని పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే కీలక మార్గంగా అభివర్ణించారు. శ్రీ హరి రామ సుబ్రహ్మణియన్ “భవిష్యత్తు టెక్నాలజీ నైపుణ్యాలు కలిగినవారే విజేతలు” అని స్పష్టం చేశారు.

IBM ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులకు అందే లాభాలను శ్రీ వికార్ ఉద్దీన్ సూర్కీ వివరించారు. ఈ కోర్సులు పరిశ్రమ మరియు విద్యా రంగ అవసరాలను సమన్వయం చేస్తూ, ఉద్యోగ అవకాశాలు పెంపొందిస్తాయని తెలిపారు.

శ్రీ శశి కిరణ్ వర్మ జీజీయూ యొక్క స్వయం ప్రతిష్ఠను ఆధారంగా తీసుకొని జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా IBMతో కలిసి ఈ ప్రోగ్రామ్ ప్రారంభించటం గర్వంగా ఉందని పేర్కొన్నారు.

ఈ భాగస్వామ్యం ద్వారా, “Artificial Intelligence & Machine Learning (AI & ML)” మరియు “Data Science” వంటి డిమాండ్ ఉన్న సాంకేతిక కోర్సులు విద్యార్థులకు అందించబడనున్నాయి. ఇవి పరిశ్రమ అవసరాలకు తగ్గట్టు రూపొందించబడినవి కావున వాస్తవ జీవితంలో విజయవంతం కావడానికి సహాయపడతాయి.

శ్రీ సుమంత్ తన ముగింపు ప్రసంగంలో విద్యార్థులు ఆవిష్కరణాత్మక దృక్పథంతో అభివృద్ధి చెందాలని ప్రేరేపించారు. విద్యార్థులు, అధ్యాపకులు ప్రశ్నోత్తర సెషన్ ద్వారా నేరుగా అతిథులతో సంభాషించే అవకాశం కలిగి, ఈ భాగస్వామ్యం ప్రయోజనాలను మరింత బాగా అర్థం చేసుకున్నారు.

కార్యక్రమంలో జీజీయూ మరియు IBM మధ్య మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ (MoU) సంతకం కూడా ఒక ముఖ్య ఘట్టంగా నిలిచింది. కార్యక్రమం ముగింపులో డా. కె. విజయ భాస్కర రాజు కృతజ్ఞతలు తెలిపి వోట్ ఆఫ్ థాంక్స్ తెలిపారు. ఈ భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యా రంగానికి కొత్త మార్గాన్ని అందిస్తూ, “Future Forward” ప్రోగ్రామ్ ద్వారా టెక్నాలజీ ఆధారిత విద్యకు దేశ స్థాయిలో దిశానిర్దేశం అవుతుంది.

US: వాషింగ్టన్‌లో కాల్పులు.. ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది మృతి

Exit mobile version