NTV Telugu Site icon

Viral Video: స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఆపిన తాగుబోతు… వీడియో చూస్తే నవ్వులే నవ్వులు

Drunker

Drunker

తాగితే చాలా మంది చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు. ఫుల్ గా తాగితే ప్రపంచం ఎటుపోతున్నా దానితో మాకు పనిలేదంటారు. కొంతమంది తాగి ఇంట్లో పడుకుంటే మరికొందరు మాత్రం రోడ్డు మీద రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. ఇలాంటి సంఘనలను కొంతమంది వీడియో తీస్తూ ఉంటారు. సోషల్ మీడియా వినియోగం ఎక్కవయ్యాక ఇటువంటి వీడియోలు కూడా ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. వీటిలో కొన్ని చిరకు తెప్పించేలా ఉంటే కొన్ని మాత్రం నవ్వులు పూయిస్తూ ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో కూడా ఓ తాగుబోతు చేసిన పని నవ్వు తెప్పిస్తోంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజు జరిగినట్టు మాత్రం వీడియో చూస్తే అర్థం అవుతుంది.

ఈ వీడియోలో ఓ తాగుబోతు రద్దీగా ఉన్న రోడ్డుపై వాహనాల మధ్యలో నుంచి వెళుతూ ఉంటాడు. అంతేకాదు వాహనాలను ఆపాలంటూ చేయి అడ్డుపెడుతూ ఉంటాడు. అయినా ఏ వాహనం కూడా ఆగదు. దీంతో ఆ తాగుబోతూ ఓ స్కూటీని గట్టిగా పట్టుకొని ఆపుతాడు. అయితే ఆ స్కూటీ నడుపుతున్న వ్యక్తి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెల్లటి బట్టలు ధరించి జాతీయ జెండా ఉన్న కండువాను పైన కప్పుకొని ఉంటాడు. స్కూటీని రోడ్డుపై అలా అడ్డంగా ఆపడంతో పాటు అతనికి చేయి చూపిస్తూ ఏదో అంటాడు. దీంతో ఆ వ్యక్తికి కోపం వచ్చి స్కూటీ దిగివచ్చి ఆ తాగుబోతు కాలర్ పట్టుకొని అతడి చెంపపై కొడతాడు. అంతేకాకుండా అతని మెడ పట్టుకొని నేలపై పడవేసి తన్నడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో అటుగా బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తి అతడిని కొట్టకుండా ఆపి గొడవను సద్దుమణిగేలా చేస్తాడు. అయితే ఇక్కడ చివరిలో ఒక కొసమెరుపు జరిగింది. అది చూస్తే మాత్రం కచ్ఛితంగా నవ్వు వస్తుంది. అన్ని దెబ్బలు తిన్న తరువాత కూడా ఆ తాగుబోతు వెళుతూ వెళుతూ తనని తన్నిన వ్యక్తిని చూసి డ్యాన్స్ చేస్తాడు. ఇది కూడా మనకు వీడియోలో కనిపిస్తోంది. ఇది చూస్తే ఆ తాగుబోతుకు ఇంకా బుద్ధి రాలేదు ఇంకా రెండు పడాల్సింది అనిపిస్తోంది. అంతేకాదు ఇక్కడ విశేషం ఏంటంటే స్వాతంత్ర్య దినోత్సవం రోజు మువన్నెల రంగు టోపీని ధరించాడు.

Also Read: Sneeze : తుమ్మును ఆపడానికి ప్రయత్నించిన వ్యక్తి… తరువాత పెద్ద షాక్

ప్రస్తుతం సాక్షి అనే వ్యక్తి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటూ పోస్ట్ చేసిన ఈ  వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ తాగుబోతును చూస్తే నవ్వొస్తుందని కొందరు అంటుంటే, అంత కొట్టినా సిగ్గులేకుండా డ్యాన్స్ చేశాడంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా తాగి రోడ్డు మీదకి వస్తే ప్రమాదమని ఇంకొందరు సూచిస్తున్నారు. అలాంటి వారిని అలాగే కొట్టాలంటూ కొంతమంది కొట్టిన వ్యక్తిన సమర్థిస్తున్నారు. మొత్తానికైతే చూడగానే నవ్వు తెప్పిస్తున్న ఈ వీడియోను మీరు కూడా ఓసారి చూసి ఆనందించండి.

Show comments