NTV Telugu Site icon

Tomato Song: టమోటా పై సాంగ్.. వింటే నవ్వాగదు…

Tamota Song

Tamota Song

ప్రస్తుతం కూరగాయల ధరలు వింటే సామాన్యుల కళ్ళల్లో కన్నీళ్లు ఆగవు.. కష్టం చేసుకొని కడుపు నిండా తిందామనుకుంటే ధరలు మండిపోతున్నాయి.. సాదారణంగా ఉల్లిపాయలు కొస్తే ఘాటుకు కన్నీళ్లు వస్తాయి.. కానీ ఇప్పుడు టమోటాల ధరలు వింటే జనాలకు వణుకు పుడుతుంది.. ఒక్కసారిగా సెంచరీ దాటేసాయి..ప్రస్తుతం మార్కెట్ లో ధరలు 100 నుంచి 200 పలుకుతున్నాయి.. పెరిగిన టమోటాలపై సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ వైరల్ అవుతున్న సంగతి చూస్తూనే ఉన్నాం.. తాజాగా టామోటా లపై కొందరు యువకులు ఏకంగా సాంగ్ నే చేశారు.. ఆ సాంగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది..

టమాటా లేని సాంబార్.. పావ్ బాజీ.. చికెన్ కర్రీ, సూప్ దేన్నైనా ఊహించగలమా? వాటికి రుచి వస్తుందా? అసలు టమాటా లేకుండా వంట అవ్వదే.. అంత డిమాండ్ ఉన్న టమాటా ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు టమాటా ధనికులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లుంది. సామాన్యుడు మర్చిపోయే పరిస్థితిలో ఉంది. దేశ వ్యాప్తంగా టమాట ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.. ఇక టమోటాల ధరలు ఎక్కడ చూసిన 100 కు పైనే ఉంటుంది..ఓ వైపు టమాటా పంటలు సైతం దొంగలు ఎత్తుకెళ్తున్నారు. బేలూరులోని పొలం నుండి రూ.2.7 లక్షల విలువైన టమాటా పంటను దొంగలు ఎత్తుకెళ్లారు. ఇటు తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలోని ఓ దుకాణంలో 20 కిలోల టమాటాలు చోరీకి గురయ్యాని వార్తలు వినిపిస్తున్నాయి..

తాజాగా పెరిగిన టమాటా ధరలపై ఇంటర్నెట్‌లో వీడియోలు, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన టమాటా పాట వైరల్ అవుతోంది. టమాటా లేని వంటకాల్ని అది కొనలేకుండా ఉన్న పరిస్థితిని అద్దం పడుతూ కొందరు కుర్రాళ్లు పాటకు స్టెప్పులు వేస్తారు. ఈ పాట విశాల్ నటించిన ‘ఎనిమి’ ఆల్బమ్ లోని ‘టమ్ టమ్’ ట్యూన్‌కు టమోటా సాహిత్యాన్ని జోడించి.. అద్భుతంగా పాటను క్రియేట్ చేశారు ఆ పాట ఇప్పుడు నెట్టింట జనాలను తెగ ఆకట్టుకుంటుంది..ఇప్పటికే టమోటా కూరలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది.. ప్రభుత్వం వీటిపై చొరవ తీసుకోవాలని సామాన్యులు కోరుతున్నారు..