Funny Cricket Moment: క్రికెట్ మైదానాల్లో అప్పుడప్పుడు కొన్ని ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనలు ఒక్క పక్కన ఉంటే, మధ్యలో జరిగే ఆసక్తికర ఘటనలు మరోవైపు. అలాంటి ఓ సరదా సంఘటన తాజాగా మహిళల టీ20 మ్యాచ్‌లో చోటుచేసుకుని సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
సాధారణంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చిన సందర్భాలు మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈసారి మాత్రం ఓ పెంపుడు కుక్క అందరి దృష్టిని ఆకర్షించింది. ‘డాజిల్’ అనే పేరున్న ఆ కుక్క యజమాని చెయ్యి దాటి నేరుగా గ్రౌండ్‌లోకి పరుగెత్తుకుంటూ వచ్చింది. ఈ ఘటన మహిళల టీ20 మ్యాచ్ జరుగుతున్న సమయంలో జరిగింది.
మ్యాచ్‌లో 9వ ఓవర్ సమయంలో వికెట్‌కీపర్ స్టంప్స్ వైపు బంతిని విసిరాడు. అంతలోనే గ్రౌండ్‌లోకి వచ్చిన డాజిల్, ఫీల్డర్ పట్టుకునేలోపే ఆ బంతిని తన నోట్లో పట్టుకుంది. అక్కడితో ఆగకుండా మైదానమంతా పరుగెత్తుతూ ఫీల్డర్లకు చుక్కలు చూపించింది. బంతిని తీసుకోవాలని ప్రయత్నించిన ఆటగాళ్లకు అది దొరక్కుండా అటూఇటూ పరుగులు పెట్టడంతో స్టేడియంలోని ప్రేక్షకులు నవ్వులు ఆపుకోలేకపోయారు.
IND vs NZ 1st ODI: సిక్స్ తో మ్యాచ్ ఫినిష్ చేస్తే ఆ కిక్కే వేరప్ప.. రసవత్త పోరులో భారత్ విజయం
చివరకు కొంతసేపటి తర్వాత డాజిల్ బ్యాటింగ్ చేస్తున్న మహిళా వద్దకు వెళ్లి తన నోట్లో ఉన్న బంతిని కింద పెట్టింది. అనంతరం ఆ కుక్కను గ్రౌండ్ వెలుపలికి పంపించడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. ఈ సరదా ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. లక్షలాది వ్యూస్ సాధించిన ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
🐶 Great fielding…by a small furry pitch invader!@ClearSpeaks #AIT20 🏆 pic.twitter.com/Oe1cxUANE5
— Ireland Women’s Cricket (@IrishWomensCric) September 11, 2021
