Site icon NTV Telugu

Funny Case: గొర్రెకు మూడేళ్లు జైలు శిక్ష

20190518 Map004 0

20190518 Map004 0

ఆఫ్రికాలో ఓ విచిత్రమై కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పు మరింత ఫన్నీగా ఉంది. దక్షిణ సుడాన్ లో ఒక గొర్రె మహిళను చంపేసింది. దీంతో అక్కడి కోర్ట్ గొర్రె పిల్లకు మూడేల్లు జైలు శిక్ష విధించారు. వివరాల్లోకి వెళితే ఈ నెల ప్రారంభంలో దక్షిణ సుడాన్ లో 45 ఏళ్ల అదీయు చాపింగ్ అనే మహిళపై గొర్రె పిల్ల దాడి చేసింది. మహిళను గొర్రె తన తలతో పదేపదే కొట్టడంతో ఆమె పక్కటెముకుల విరిగి తీవ్రగాయాల పాలై మరణించింది. దక్షిణ సుడాన్ లోని రుంబెక్ ఈస్ట్ లోని అకుయెల్ యోల్ అనే ప్రదేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత సదరు గొర్రె పిల్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు యజమాని నిర్థోషి అని… మరణానికి కారణం గొర్రె అని తేల్చారు. స్థానిక మీడియా నివేదిక ప్రకారం సుడాన్ లోని లేక్ స్టేట్ లోని అడ్యూల్ కౌంటీ సైనిక శిబిరంలో గొర్రె మూడేళ్లు  గడుపుతుందని కోర్ట్ తీర్పు చెప్పింది.

గొర్రె యజమాని బాధితురాలి కుటుంబానికి ఐదు పశువులను పరిహారం కింద ఇవ్వాలని కోర్ట్ తీర్పు చెప్పింది. ఇంతే కాకుండా మూడేళ్లు శిక్ష పూర్తి చేసుకున్న తరువాత గొర్రె తన యజమానికి చెందదని.. ఆ దేశ చట్టాల ప్రకారం ఒక వ్యక్తిని చంపే ఏదైనా జంతువు బాధిత కుటుంబానికే చెందుతుందని తీర్పు వెల్లడించింది.

Exit mobile version