Site icon NTV Telugu

FSSAI Jobs: ఫుడ్ సేఫ్టీ అథారిటీలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి ఇలా..

Fssai

Fssai

FSSAI Jobs: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)లో పనిచేయాలని కలలు కంటున్న యువత కోసం అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇటీవల FSSAI గ్రూప్ A, గ్రూప్ B స్థాయి ఖాళీలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ www.fssai.gov.in లో ఈ ఉద్యోగానికి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అభ్యర్థులు 29 జూలై 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. FSSAI ద్వారా.., అసిస్టెంట్ డైరెక్టర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ రెండు పోస్టులు గ్రూప్ A , గ్రూప్ B ఆఫీసర్ స్థాయికి చెందినవి. వీటిలో అభ్యర్థులు మంచి జీతం కూడా పొందుతారు.

Driving License: మాన్యువల్​ పద్ధతికి ఇక చెక్.. డ్రైవింగ్ ​లైసెన్స్​కు కొత్త పరీక్ష..

అసిస్టెంట్ డైరెక్టర్ 5 పోస్టులకు 56,100 -1,77,500/- గా జీతం ఇవ్వనున్నారు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 06 పోస్టులకు 47,600 -1,51,100/- గా జీతాలు ఇవ్వనున్నారు. ఈ ఉద్యోగాలు భారతదేశంలో ఎపోస్టింగ్ ఎక్కడైనా ఉండొచ్చు. ఇంతకుముందు, ఈ పోస్టులకు జనవరి 8, 2024 నుండి జనవరి 29, 2024 వరకు దరఖాస్తులను ఆహ్వానించారు. కానీ., ఇప్పుడు దరఖాస్తు ప్రక్రియ మళ్లీ ప్రారంభించబడింది. అసిస్టెంట్ డైరెక్ట్ పోస్ట్ కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్, హ్యూమన్, రిసోర్స్, డెవలప్‌మెంట్ మొదలైన వాటిని నిర్వహించడంలో 6 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు కూడా అభ్యర్థులు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఇందులో మూడేళ్ల అనుభవం ఉండాలి.

Fixed Deposit: మీ డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా.? అయితే ఇది మీకోసమే..

ఈ రిక్రూట్‌మెంట్‌లో అభ్యర్థులను డిప్యూటేషన్ ద్వారా నియమిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ హార్డ్ కాపీని కూడా చివరి తేదీకి ముందు కార్యాలయానికి పంపాలి. దీనిలో అర్హతకు సంబంధించిన అన్ని అవసరమైన పత్రాల ఫోటోకాపీలు ఉండాలి. చిరునామా: అసిస్టెంట్ డైరెక్టర్, FSSI ప్రధాన కార్యాలయం, మూడవ అంతస్తు, FDA భవన్, కోట్లా రోడ్, న్యూఢిల్లీ. అడ్రెస్స్ కు పంపాలి. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఏదైనా సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Exit mobile version