NTV Telugu Site icon

Eye Health: ఇక కళ్లజోడుకు బై బై.. వీటితో కంటిచూపును మెరుగుపరుచుకోండి

Eyes

Eyes

Eye Health: ప్రస్తుతం చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలు సెల్ ఫోన్ లాంటి కళ్లకు హాని చేసే వాటిని చూస్తూ పెరుగుతున్నారు. ఈ కారణంగానే 100మందిలో కనీసం సగానికిపైగా  కంటి సమస్యలతో బాధపడుతున్నారు. మన జీవశైలి, ఆహారపు అలవాట్లు కూడా కంటి చూపు పై ప్రభావం చూపుతాయి.  మనం తినే ఆహారపు పదార్థాలలో కొన్ని చేర్చుకోవడం వల్ల కళ్ల సమస్యలను డాక్టర్ అవసరం లేకుండా శాశ్వతంగా తగ్గించుకోవచ్చు.

Also Read: Tata Nexon facelift: నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. వేరియంట్ వారీగా రేట్లను ప్రకటించిన టాటా మోటార్స్..

పుల్లటి పండ్లు: కంటిచూపు మెరుగుపరచుకోవడానికి ఆహారంలో సిట్రస్ పండ్లు తీసుకుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం వీటిని క్రమం తప్పకుండా ఓ పద్దతిలో తీసుకోవాలి. విటమిన్-సి కంటి శుక్లం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కేవలం కంటి చూపు మెరుగుపరచడమే కాదు, వృద్దాప్య ఛాయలు తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మ సౌందర్యానికి, జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది.

యాపిల్: కంటి చూపు మెరుగుపడటానికి విటమిన్ ఏ చాలా అవసరం. దాని కోసం రోజు యాపిల్స్ తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. అందుకే రోజుకు ఒక యాపిల్ ఎన్నో రోగాలను దూరం చేస్తుంది అనే నానుడి కూడా ఉంది.

బెర్రీలు: బెర్రీలు సాధారణంగా కొద్దిగా పుల్లగా ఉంటాయి. వీటిలో సీ విటమిన్ చాలా మంచిగా లభిస్తుంది. ఇది కంటిచూపును మెరుగుపచడంలో సహాయపడుతుంది. దీంతో కంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

ఆప్రికాట్: వీటిలో  విటమిన్ -ఎ, విటమిన్-సి, విటమిన్-ఇ, కెరోటినాయిడ్లు, బీటాకెరోటిన్ వంటివి ఉంటాయి. ఇవి కంటిచూపును మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే బీటా కెరోటిన్ ప్రొవిటమిన్ గా పనిచేస్తుంది. అంటే శరీరంలో చేరే విటమిన్-ఎను గ్రహించడంలో, దాన్ని శరీరం ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. ఈ కారణంగా ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది.

అరటిపండు: ఇవి సాధారణంగా చౌకగా లభిస్తాయి. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో ఉంటాయి.  అరటిపండులో పొటాషియం, విటమిన్-ఎ ఉంటాయి. కళ్లు పొడిబారే సమస్యతో ఇబ్బందిపడేవారు అరటిపండ్లు తీసుకుంటే ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది.  కాబట్టి రోజూ అరటిపండును ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మంచిది.

బొప్పాయి: ఈ పండులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది అనే సంగతి చిన్నప్పటి నుంచి మనందరికి  తెలిసిందే.  బొప్పాయిలో కూడా విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-ఇ ఉంటాయి. కంటి చూపును పెంపొందించడంలో ఇవి ఉపయోగపడతాయి.