NTV Telugu Site icon

Frozen Lake Marathon: భారత్‌లో తొలి ఫ్రోజెన్‌ లేక్‌ మారథాన్‌.. గడ్డకట్టిన సరస్సుపై పరుగులు

Frozen Lake Marathon

Frozen Lake Marathon

Frozen Lake Marathon: ప్రపంచంలోనే ఎత్తయిన గడ్డకట్టిన ఉప్పునీటి సరస్సు అయిన లద్ధాఖ్‌లోని పాంగాంగ్ సరోవరంలో మారథాన్‌ను ఫిబ్రవరి 20వ తేదీన నిర్వహించనున్నారు. ఘనీభవించిన సరస్సుపై పరుగును నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సరస్సులోని నీరు అంతా గడ్డకట్టిపోవడంతో ఆ మంచు గడ్డలపై పరుగులు తీయనున్నారు. భారత్‌లో ఇలాంటి ఫ్రోజెన్‌ లేక మారథాన్ నిర్వహించడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. సముద్ర మట్టం నుంచి 13,862 అడుగుల ఎత్తున ఉన్న ఈ సరస్సు దాదాపు 700 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది.

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 27 ఫైరింజన్లు

21 కిలోమీటర్ల మారథాన్ లుకుంగ్ నుంచి ప్రారంభమై మాన్ గ్రామంలో ముగుస్తుంది. డెబ్బై-ఐదు మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు, ప్రపంచంలోనే అత్యధికంగా ఘనీభవించిన సరస్సు మారథాన్ కోసం గిన్నిస్ ప్రపంచ రికార్డు కోసం బిడ్ చేయడానికి వారికి అవకాశం కల్పించారు. లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్-లే, టూరిజం డిపార్ట్‌మెంట్, లేహ్ అడ్మినిస్ట్రేషన్‌తో కలిసి లడఖ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఫౌండేషన్ దీనిని నిర్వహిస్తోంది. ప్రస్తుతం శీతాకాలంలో ఇక్కడ మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. సైన్యంతోపాటు ఇండో – టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) ఈ కార్యక్రమ నిర్వహణలో నిమగ్నమై ఉన్నట్లు సీనియర్‌ ప్రభుత్వ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. వాతావరణ మార్పులను ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో ఈ మారథాన్‌కు ‘‘లాస్ట్‌ రన్‌’’ అనే పేరు పెట్టారు. ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని మరింత విస్తరించేందుకు మారథాన్‌ ఉపయోగపడుతుందని లేహ్‌ డిస్ట్రిక్ట్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ బాలాసాహెబ్‌ సుసె వెల్లడించారు.

Show comments