NTV Telugu Site icon

Las Vegas: తృటిలో తప్పిన పెను ప్రమాదం.. విమానం ల్యాండ్ అవుతుండగా మంటలు

Plane

Plane

Las Vegas frontier airlines plane: అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఘోర ప్రమాదం తప్పింది. ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానంలో 190 మంది ప్రయాణికులు, 7 మంది సిబ్బంది ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. సకాలంలో ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి తరలించారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1326 శాన్ డియాగో నుండి లాస్ వెగాస్‌కు లాస్ వెగాస్‌లోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానం ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన పైలట్లు లాస్ వెగాస్‌లో అత్యవసర ల్యాండింగ్ చేయడానికి అనుమతి కోరారు.

Team India: డబుల్ ధమాకా.. టీమిండియాకు ఆ ఇద్దరే కీలకం: దినేశ్‌ కార్తిక్

ఇక వైరల్ అయిన వీడియోలో ల్యాండింగ్ సమయంలో విమానం మంటల్లో చిక్కుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసి వెంటనే మంటలను ఆర్పివేయడం విశేషం. దీని తరువాత, మొత్తం 190 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందిని వెంటనే విమానం నుండి దించేశారు. విమానయాన సంస్థ ప్రకారం, విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉన్నారని.. ఎవరికీ గాయాలు కాలేదని తెలిపింది.

Donald Trump: ట్రంప్‌ ప్రచార సభలో ఎలాన్‌ మస్క్‌.. వేదికపై కొత్త ఉత్సాహం