NTV Telugu Site icon

IND vs SL: నేడే శ్రీలంక, టీమిండియా మొదటి వన్డే.. ఎవరి బలాబలాలేంటి?

Ind Vs Sl First Odi

Ind Vs Sl First Odi

IND vs SL First ODI at Colombo: నేడు శుక్రవారం కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే నేటి మధ్యాహ్నం 2:30 గంటలకు కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. టి20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని గెలుచుకున్న తర్వాత మొదటిసారిగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ బ్యాట్స్‌మెన్లు క్రికెట్ మైదానంలో కనిపించనున్నారు. వన్డే సిరీస్‌ లో రోహిత్ శర్మ కెప్టెన్‌ గా తిరిగి రానున్నాడు. మరికొందరు స్టార్ ఆటగాళ్లు కూడా వన్డే సిరీస్‌కు తిరిగి వచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్‌ లకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక అంత సులభం కాదు. శ్రీలంకతో జరిగే తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌ లో ఎవరు ఉండబోతున్నారు.? ఎవరి బలాబలాలేంటో ఓసారి చూస్తే..

Uttarakhand : కేదార్ నాథ్ లో క్లౌడ్ బరస్ట్.. దారిలో చిక్కుకున్న 48మంది భక్తులు

శ్రీలంకతో వన్డే సిరీ స్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే, రోహిత్ శర్మతో పాటు శుభమన్ గిల్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉండడంతో.. ఓపెనింగ్ పెయిర్ విషయంలో పెద్దగా టెన్షన్ అవసరం లేదు. అంటే ఓపెనింగ్ జోడీ దాదాపు ఖాయమైనట్లే. దీని తర్వాత విరాట్ కోహ్లి మూడో ర్యాంక్‌లోకి రావడం ఖాయం. ఈ సిరీస్లో కొన్ని రికార్డులు కూడా విరాట్ కోహ్లి తను బద్దలు కొట్టడానికి రెడీగా ఉన్నాయి. దీని తరువాత నాలుగువ స్థానానికి ఖచ్చితంగా కొంత సస్పెన్స్ నెలకొనిఉంది. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇద్దరికీ జట్టులో చోటు దక్కింది. రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. రిషబ్‌ పంత్‌ కీపర్‌ గా వ్యవహరిస్తాడనే నమ్మకం ఉంది. అయితే శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లలో ఒకరికి మాత్రమే అవకాశం దక్కే అవకాశం ఉంది. అంటే ఈ ముగ్గురు ఆటగాళ్లలో ఇద్దరు మాత్రమే ఆడే అవకాశం ఉంది. ఇప్పుడు కోచ్‌తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనేదే సందేహం.

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

ఆ తర్వాత అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు అల్ రౌండర్స్ జట్టులో భాగం. కాబట్టి, వారిద్దరూ టీంలో ఉండే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే., వీరిద్దరికీ అద్భుతమైన బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ కూడా బాగానే ఉంది. దీని తరువాత, కుల్దీప్ యాదవ్ మూడవ స్పిన్నర్‌గా ఆడటం చూడవచ్చు. ఇక ముగ్గురు ఫాస్ట్ బౌలర్ల గురించి చూసినట్లైతే.. మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్ లు ఉండనున్నారు.

Trump: ఒక మహిళ కారణంగానే ప్రాణాలతో ఉన్నా.. స్టేజ్‌పైకి పిలిచి హగ్ చేసుకున్న ట్రంప్

శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (WK), రిషబ్ పంత్ (WK), శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ర్యాన్ పరాగ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.