భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామపంచాయతీ పరిధిలోని ఆదివాసి గూడెం అయిన ఎర్రబోడు గ్రామంలో మడకం తుల తను సాగు చేసుకుంటున్న పోడు భూములలో చండ్రుగొండ ఫారెస్ట్ రేంజర్ ప్లాంటేషన్ మొక్కలు వేశాడు. ఈరోజు ఉదయం రోజులాగానే తన పొలంలో పశువుల మేపుతున్న క్రమంలో అటువైపు వెళుతున్న ఫారెస్ట్ రేంజర్స్ శ్రీనివాసరావు, సెక్షన్ ఆఫీసర్ రామారావు మడకం తులాను హెచ్చరించటంతో అక్కడ చోటు చేసుకున్న గొడవ కాస్త ఘర్షణకు దారి తీయడంతో ఆవేశంతో తన చేతిలో ఉన్న కోడవలతో శ్రీనివాసరావుపై దాడి చేయగా అక్కడి నుంచి తప్పించుకున్న సెక్షన్ ఆఫీసర్ రామారావు పోలీసులకు సమాచారం అందించారు. ఈ దాడిలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయాలు ఆయ్యాయి.
Also Read : Rare Disease: అరుదైన వ్యాధి.. ఈ వ్యక్తికి శరీరమంతా వెంట్రుకలే..!!
దీంతో.. శ్రీనివాసరావుకు ఒళ్లంతా రక్తస్రావం అయింది. అయితే.. వెంటనే రేంజర్ శ్రీనివాసరావుని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కొత్తగూడెం నుంచి ఖమ్మం తరలించారు. అయితే అక్కడ శ్రీనివాసరావు చికిత్స పొందుతూ మరణించాడు. అయితే.. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు సీఎం కేసీఆర్. శ్రీనివాస రావు ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుంటుబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ప్రకటించింది. వారి స్వస్థలం రఘునాథపాలెం మండలం ఈర్లపుడి గ్రామంలో రేపు 23న ప్రభుత్వ అధికారిక లంచనలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అత్యక్రియల్లో అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరుకానున్నారు.