Gangavaram Beach: ఫ్రెండ్షిప్ డే రోజున విషాదం.. స్నేహితురాలిని కాపాడబోయి యువకుడు గల్లంతు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Friendship Day Tragedy in Visakhapatnam: ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సరదాగా గడపాలని వెళ్లిన స్నేహితుల బృందంలో విషాదం చోటుచేసుకుంది. విశాఖపట్నంలోని పెదగంట్యాడ మండలం పాత గంగవరం బీచ్‌లో సముద్ర అలలు ఇద్దరిని లోనికి లాక్కెళ్లాయి. యువతి నీతూ (18), యువకుడు దామోదర్ గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న న్యూ పోర్ట్ పోలీసులు, బీచ్ లైఫ్‌గార్డులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఏడుగురు స్నేహితులు పాత గంగవరం బీచ్‌కు వెళ్లారు. వారిలో నలుగురు యువతులు, ముగ్గురు యువకులు ఉన్నారు. బీచ్ సమీపంలో అందరూ కలిసి ఫోటోలు దిగుతుండగా.. జాలరిపేటకు చెందిన నీతూ ప్రమాదవశాత్తు సముద్ర అలల్లో కొట్టుకుపోయింది. ఆమెను గమనించిన పెందుర్తికి చెందిన దామోదర్ వెంటనే సముద్రంలోకి దిగి రక్షించేందుకు ప్రయత్నించాడు. అయితే బలమైన అలల కారణంగా అతడు కూడా గల్లంతయ్యాడు.
Also Read
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
- Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
గల్లంతైన నీతూ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. మరోవైపు దామోదర్‌కు కొద్ది రోజులలో కనకమహాలక్ష్మి అనే యువతితో వివాహం జరగాల్సి ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. పెళ్లికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడం కుటుంబ సభ్యులను విషాదంలో ముంచెత్తింది. సమాచారం అందుకున్న న్యూ పోర్ట్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బీచ్ లైఫ్గార్డులతో కలిసి గాలింపు చర్యలు ప్రారంభించారు. సముద్రంలో గల్లంతైన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. బలమైన అలలు, సముద్ర పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. వారిని గుర్తించేందుకు అధికారులు అన్ని విధాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?