Fridge: ఎక్కువ రోజులు ఊరు వెళుతున్నారా? అయితే ఫ్రిడ్జ్ లో వీటిని తీసేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fridge Maintenance Tips: మనం ఊరు వెళుతున్నప్పుడు అన్నీ చక్కగా సర్దుకుంటాం. ఇంట్లో వస్తువులన్నింటిని మంచిగా శుభ్రం చేసి పెడతాం. తాళలు అన్ని వేశామా లేదా అని చెక్ చేసుకొని వెళతాం. అయితే ఫ్రిడ్జ్ మాత్రం ఆ సమయంలో మనకు అస్సలు గుర్తుకు రాదు. దాని గురించి అస్సలు మనం ఆలోచించం. అయితే మీరు కనుక ఎక్కువ రోజులు ఇళ్లు విడిచి వేరే ప్రాంతానికి వెళుతున్నట్లయితే ఫ్రిడ్జ్ లో కొన్ని వస్తువులను తీసేసి వెళ్లడం మంచిది లేదంటే వచ్చే సరికి ఫ్రిడ్జ్ లో నుంచి చెడు వాసన రావడం, ఆ వస్తువులు పాడైపోవడం లాంటివి జరగొచ్చు.
Also Read
మీరు ఎక్కువ రోజు ఊరు వెళుతున్నట్లయితే ఫ్రిడ్జ్ ను కూడా పూర్తిగా శుభ్రం చేసి వెళ్లండి. నీటితో లేదా వెనిగర్ తో ప్రిడ్జ్ షెల్ఫ్స్ అన్ని క్లీన్ చేయండి. దానిలో పాడయ్యి పోయే వస్తువులు ఏవి లేకుండా చూసుకోండి. అలా అయితే మీరు వచ్చేసరికి ఫ్రిడ్జ్ పాడవకుండా, దుర్వాసన రాకుండా ఫ్రెష్ గా ఉంటుంది. దీని వల్ల మీరు ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే కూడా ఫ్రిడ్జ్ ను వాడుకోవచ్చు అలాగే మీరు ఊరు నుంచి వాటిని కూడా ఏ మాత్రం సందేహించకుండా అందులో ఉంచుకోవచ్చు. మీరు వెళ్లే ముందు ఫ్రిడ్జ్ లో కూరగాయలు, పాలు, పెరుగు లాంటివి ఉంటే వెంటనే వాటిని తీసి పాడేయ్యండి. ఎందుకంటే మీరు వచ్చే సరికి అవి కుళ్లిపోయి ఫ్రిడ్జ్ మొత్తం చెడు వాసన రావడంతో పాటు అది పాడవుతుంది కూడా. ఇక వెళ్లేటప్పడు ఫ్రిడ్జ్ టెంపరేచర్ ను పెంచి వెళ్లండి. దీని వల్ల ఫ్రిడ్జ్ లో ఉండే కొన్ని వస్తువులు పాడవకుండా ఉంటాయి అంతేకాకుండా కరెంట్ బిల్లు కూడా ఎక్కువ రాకుండా ఉంటుంది. ఇక వీలైతే ఫ్రిడ్జ్ ప్లగ్ కూడా తీసేసి వెళ్లండి. దీని వల్ల కరెంట్ ఫ్లో లో ఎలాంటి మార్పులు ఉన్నా ఫ్రిడ్జ్ కు ఎలాంటి ప్రమాదం జరగదు. అంతేకాకుండా కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుంది. ఇక రిఫ్రిజిరేటర్‌లో మాన్యువల్ డీఫ్రాస్ట్ ఫ్రీజర్ కంపార్ట్‌మెంట్ ఉంటే, దానిని డీఫ్రాస్ట్ చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల ప్రిడ్జ్ లో మంచు ఏర్పడదు. దాని వల్ల వస్తువులు పెట్టుకోవడానికి స్పేస్ వస్తుంది. అదేవిధంగా డీఫ్రాస్ట్ కరెంట్ బిల్లు ఎక్కువ యూనిట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. కేవలం ఊరు వెళ్లేటప్పుడే కాకుండా రెగ్యూలర్ కూడా ఫ్రిడ్జ్ ను క్లీన్ చేస్తూ ఉండాలి. దాని వాల్వులను శుభ్రం చేస్తూ ఉండాలి. ఇలా చేస్తేనే ప్రిడ్జ్ ఎక్కువ రోజులు పాడవకుండా పనిచేస్తుంది.
తాజావార్తలు
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!