శుక్రవారం లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తారు.. ఈ రోజు లక్ష్మీ దేవిని పూజిస్తే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. లక్ష్మీదేవి రోజుగా పరిగణించే శుక్రవారం రోజున తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహిస్తుంది. ఆ తప్పులేమిటో తెలుసుకుని చేయకుండా ఉండటానికి ప్రయత్నించడం వల్ల ఆమె అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి…అవేంటో చూద్దాం..
ఆడవాళ్లు మహా లక్ష్మీలు అంటారు.. శుక్రవారం రోజు స్త్రీలను, బాలికలను, నపుంసకులను అవమానించకూడదు. వారి గురించి చెడుగా మాట్లాడకూడదు. వారి గురించి చెడుగా ఆలోచించకూడదు, చెడుగా ప్రవర్తించకూడదు. శుక్రవారం రోజు స్త్రీలను అవమానిస్తే లక్ష్మీ దేవి ఆగ్రహిస్తుందని పండితులు చెబుతున్నారు..
శుక్రవారం రోజు చక్కెరను అప్పుగా ఇవ్వకూడదు. పొరుగింటి వారికి చక్కెర ఇవ్వడం వల్ల శుక్రుడు బలహీనపడి సంపదను, ఐశ్వర్యాన్ని ప్రభావితం చేస్తాడు. భౌతిక సుఖాలకు దూరం చేస్తాడు..
ఆర్థిక లావాదేవీలు నిర్వహించకపోవడమే మంచిది. ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. శుక్రవారం రోజు మన చేతి నుంచి వెళ్లే డబ్బు తిరిగి రాదని అంటారు. అలాగే ఇతరుల నుంచి అప్పు తీసుకోవడం కూడా మంచిది కాదు..
అలాగే ఈరోజు చెడుకు దూరంగా ఉండాలి..ఎవరితోనూ అసభ్యకరంగా, చెడుగా ప్రవర్తించకూడదు, మాట్లాడకూడదు. చెడు వ్యక్తుల వద్ద ఉండటానికి లక్ష్మీదేవి ఇష్టపడదు. లక్ష్మీ దేవి దూరమైతే ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారులు, ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతారు.. ఆర్థిక నష్టాలు కలుగుతాయి..
ఇకపోతే ఈరోజు మద్యం సేవించకూడదు, మాంసం ముట్టుకోకూడదు.. ఇవన్నీ తప్పక గుర్తుంచుకోవాలి.. ఇవ్వన్నీ చెయ్యకుండా ఉంటే లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది డబ్బుకు డోకా ఉండదు..