Site icon NTV Telugu

Friday Remedies: శుక్రవారం నాడు ఈ 3 నివారణలు చేస్తే.. మీరు కోటీశ్వరుకు అవ్వడం పక్కా!

Notes 500

Notes 500

Do These Remedies on Friday to Lakshmi Devi for Huge Money: సనాతన ధర్మంలో వారంలోని ఏడు రోజులూ ఏదో ఒక దేవుడు లేదా దేవతకి అంకితం చేయబడింది. ఈ క్రమంలో శుక్రవారం లక్ష్మీదేవి పూజకు అంకితం చేయబడింది. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే.. మీ కోరికలన్నీ నెరవేరుతాయని సనాతన ధర్మంలో చెప్పబడింది. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి 3 ప్రత్యేక చర్యలు ఉన్నాయి. ఈ చర్యలు చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆశీర్వాదాలు మీ కుటుంబంపై ఉంటాయి. ఆ చర్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎర్రటి పువ్వులు:
శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రం ముందు ఎర్రటి పువ్వులు సమర్పించండి. వీటితో పాటు పాలతో చేసిన స్వీట్లను కూడా నైవేద్యంగా పెట్టొచ్చు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ఆ వ్యక్తికి తన ఆశీర్వాదాలను అందజేస్తుంది.

తులసి మొక్కకు ప్రత్యేక పూజలు:
సనాతన ధర్మంలో లక్ష్మీదేవి తులసిలో నివసిస్తుందని నమ్ముతారు. అందువల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వత ఆశ్రయం పొందాలంటే.. మీ ఇంట్లో తులసి మొక్కను నాటాలి. రోజూ ఆ మొక్కకు నీరు పోయాలి. ఇక శుక్రవారం ప్రత్యేక పూజలు చేయాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది.

Also Read: Donald Trump Arrest: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్ట్‌.. 20 నిమిషాల పాటు..!

చీమలకు పంచదార:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం… నల్ల చీమలకు శుక్రవారం నాడు పంచదార లేదా పిండి వేయాలి. ఇది పెద్ద విరాళంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి సంతోషంగా ఉంటుంది. మీ సామర్థ్యం మేరకు శుక్రవారం నాడు ఎవరికైనా దానం చేయండి. ఇది మీకు సంతృప్తిని ఇస్తుంది. దాంతో లక్ష్మీదేవి దీవెనలు మీపై ఉండి.. డబ్బు రాక ప్రారంభం అవుతుంది.

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ntvtelugu.com దీన్ని ధృవీకరించలేదు.)

Exit mobile version