MP Navneet Rana: నకిలీ కుల ధ్రువీకరణ పత్రం కేసులో లోక్‌సభ ఎంపీ నవనీత్ రాణా, ఆమె తండ్రిపై ముంబై కోర్టు తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇంతకు ముందు సెప్టెంబర్‌లోనూ ఎంపీతో పాటు ఆమె తండ్రిపై వారెంట్ జారీ కాగా.. అది ఇంకా అమలు కాలేదు. ఈ వ్యవహారం సోమవారం విచారణకు రాగా, అమరావతి ఎంపీ రాణా, ఆమె తండ్రిపై వారెంట్ అమలుకు మరింత గడువు కావాలని పోలీసులు కోరారు. అయితే పోలీసుల అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పీఐ మొకాషి వీరిద్దరిపై తాజాగా నాన్‌బెయిలబుల్ జారెంట్ జారీ చేశారు. నాన్ బెయిలబుల్ వారెంట్‌పై నివేదిక దాఖలు చేసేందుకు కోర్టు కేసును నవంబర్ 28కి వాయిదా వేసింది.
Himachal Pradesh: కాంగ్రెస్‌కు భారీ షాక్.. ఎన్నికల వేళ బీజేపీలోకి 26 మంది కీలక నేతలు
ముంబైలోని ములుంద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు ప్రకారం, ఎంపీ నవనీత్ రాణా, ఆమె తండ్రి తాను ఎన్నికైన స్థానం షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు రిజర్వ్ చేయబడినందున కుల ధ్రువీకరణ పత్రాన్ని నకిలీ చేశారని ఆరోపించారు. అమరావతి ఎంపీకి జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాన్ని కల్పిత పత్రాలను ఉపయోగించి మోసపూరితంగా పొందారని బాంబే హైకోర్టు 2021లో రద్దు చేసింది.