NTV Telugu Site icon

Neeraj Chopra-Visa: నీరజ్ చోప్రా ‘గోల్డ్’ కొడితే.. ప్రపంచంలో ఎక్కడికైనా ఫ్రీగా వెళ్లొచ్చు!

Neeraj Chopra

Neeraj Chopra

Free Visa If Neeraj Chopra Wins Gold: పారిస్ ఒలింపిక్స్​ 2024లో స్టార్ జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రాపై భారత అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. విశ్వ క్రీడల్లో నీరజ్​ మరో స్వర్ణ పతకం గెలవడం ఖాయం అని అందరూ భావిస్తున్నారు. అయితే జర్మనీకి చెందిన 19 ఏళ్ల మాక్స్ డెహ్నింగ్ నుంచి నీరజ్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. జర్మన్ వింటర్ త్రోయింగ్ ఛాంపియన్‌షిప్‌లో మాక్స్ 90.20 మీటర్లు విసిరాడు. ఈ సంవత్సరంలో ఈ మార్కును దాటిన మొదటి జావెలిన్ త్రోవర్ కావడం విశేషం.

అయితే పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధిస్తే అందరికీ ఉచిత వీసాలు ఇస్తామని ఆన్‌లైన్ వీసా స్టార్టప్ సంస్థ అట్లీస్ సీఈవో మోహక్ నహ్తా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఏ దైశానికైనా వెళ్లేందుకు ఫ్రీ వీసా ఇప్పిస్తానన్నారు. ‘పారిస్ ఒలింపిక్స్​లో నీరజ్ గోల్డ్ మెడల్ సాధిస్తే ఫ్రీ వీసా ఇప్పిస్తా.. లెట్స్ గో’ అని మోహక్ ఆన్​లైన్ జాబ్ సెర్చింగ్ ప్లాట్​ఫామ్ లింక్డ్‌ఇన్‌లో తాజాగా పోస్ట్ చేశారు. ఆఫర్​ ప్రాసెస్ ఏంటో చెప్పాలంటూ యూజర్లు అడగగా.. ప్రొసిజర్​ను వివరంగా చెప్తూ మోహక్ మరో పోస్ట్​ చేశారు.

Also Read: Hero Nani: నాకు ఇప్పుడు ఆ ఆసక్తి లేదు: నాని

‘నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధిస్తే అందరికీ ఫ్రీ వీసా ఇస్తానని జులై 30న చెప్పాను. ఆగస్టు 8న జావెలిన్ త్రో ఫైనల్ జరగనుంది. నీరజ్ గోల్డ్ మెడల్ నెగ్గితే.. యూజర్లందరికీ మా కంపెనీ తరఫున ఒక్క రోజు ఫ్రీ వీసా ఇప్పిస్తాం. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా వీసా ఖర్చు మాదే. మీ ఈమెయిల్ కామెంట్ బాక్స్​లో పెట్టండి. వీసా పొందేందుకు వీలుగా మీకు ఓ అకౌంట్ క్రియేట్ చేస్తాం’ అని మోహక్ క్లారిటీ ఇచ్చారు. యూఎస్‌లోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న అట్లీస్ కంపెనీకి భారత్‌లో ఢిల్లీ, ముంబైలలో శాఖలు ఉన్నాయి. 2020 టోక్యో ఒలింపిక్స్​లో నీరజ్ బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే.

Show comments