Site icon NTV Telugu

Free Power Supply: రాష్ట్రంలోని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి లోకేష్ చొరవ?

Free Power Supply

Free Power Supply

Free Power Supply: వినాయకచవితి పండుగను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వినాయక చవితి ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో పందిళ్లకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు నిర్వాహకులు మంత్రి నారా లోకేష్ ను కోరారు. దీనిపై స్పందించిన లోకేష్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో మాట్లాడారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15వేలకు పైగా గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు.

D Raja: నక్సలైట్లు పేరుతో గిరిజనుల్ని చంపుతున్నారు!

గణేష్ ఉత్సవ పందిళ్లకు ఉచిత విద్యుత్ అందించడానికి రూ.25 కోట్లు ప్రభుత్వం భరించాల్సి ఉంది. రాష్ట్రంలోని కోట్లాది గణేష్ భక్తుల సౌలభ్యం దృష్ట్యా ఉచిత విద్యుత్ అందించేలా చూడాలని మంత్రి లోకేష్ చేసిన వినతిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ప్రత్యేకంగా జీ.ఓ విడుదలకు ఆదేశాలు జారీచేశారు. అలాగే రాబోయే విజయదశమి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసి దుర్గా దేవి మండపాలకి కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందనుంది.

Budda Rajasekhar Reddy: దాడి చేశానని నిరూపిస్తే బహిరంగంగా మోకాళ్లపై కూర్చొని క్షమాపణ చెప్పేందుకు సిద్ధం

Exit mobile version