NTV Telugu Site icon

Free Gas Scheme: ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకం ప్రారంభించి.. టీ చేసిన సీఎం!

Ap Cm

Ap Cm

ఏపీలో ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకంను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురం నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఈదుపురంలో లబ్ధిదారల ఇంటికి వెళ్లిన బాబు.. దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ను అందజేశారు. శాంతమ్మ అనే మహిళ ఇంట్లో స్వయంగా స్టవ్‌ వెలిగించిన సీఎం.. టీ చేసి తాగారు. శాంతమ్మ కుటుంబసభ్యులతో మాట్లాడుతూ.. వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు.

Also Read: Vikkatakavi : తెలుగు, తమిళ భాషల్లో ఓటీటీ లో రిలీజ్ కానున్న‘వికటకవి’

సీఎం చంద్రబాబు మరో లబ్ధిదారు ఇంటికి వెళ్లి.. ఒంటరి మహిళ పింఛను అందించారు. ఆ కుటుంబానికి ఇల్లు కట్టించి ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. రేపటి నుంచే ఇల్లు పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ను చంద్రబాబు ఆదేశించారు. ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్‌, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. దీపం 2.0 పథకంలో భాగంగా నాలుగు నెలలకోసారి ఉచిత సిలిండర్‌ అందిస్తారు. లబ్ధిదారులు ముందుగా డబ్బు చెల్లించినా.. సిలిండరు ఇంటికి చేరిన 48 గంటల్లోగా వినియోగదారు ఖాతాలో రాయితీ జమ అవుతుంది.

Show comments