భారతదేశానికి స్వాతంత్ర్య వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర్య వజ్రోత్సవాల పేరిట వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ వేవ్ కనిపిస్తోంది. రాజధాని హైదరాబాద్‌లో ప్రభుత్వ కార్యాలయాలు మొదలూ ఫ్లైఓవర్లు, ప్రధాన కూడళ్లలో వజ్రోత్సవ వేడుకల శోభ కనిపిస్తోంది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఆగస్ట్ 15న పార్కుల్లోకి సందర్శకులందరికీ ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తుంది.
లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్క్, లేక్ వ్యూ పార్క్, మెల్ కోటే పార్క్, ప్రియదర్శిని పార్క్, రాజీవ్ గాంధీ పార్క్, పటేల్ కుంట పార్క్, లంగర్ హౌజ్ పార్క్ మరియు చింతలకుంట పార్క్ నగరంలోని హెచ్‌ఎండీఏ పార్కుల్లో స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రవేశం ఉచితం. స్వాతంత్ర్య దినోత్సవం నాడు హెచ్‌ఎండీఏ నిర్వహించే అన్ని పార్కుల్లోకి ఉచిత ప్రవేశం ఉంటుందని అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
