Free Electricity: గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Free Electricity for Ganesh Mandapams: భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథినే ‘గణేష్ చతుర్థి’గా భావిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం.. 2026లో వినాయక చవితి సెప్టెంబర్ 14వ జరుపుకోనున్నారు. వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. గణేష్ ఉత్సవాలను ప్రజలు మరింత వైభవంగా, ఉత్సాహంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. దీంతో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులకు విద్యుత్ ఖర్చుల భారం తగ్గనుంది. ప్రభుత్వ నిర్ణయంపై గణేష్ ఉత్సవాల నిర్వాహకులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. గణనాథుడి కృపతో రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని కోరుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలకు మరింత ఉత్సాహం నెలకొననుంది. మండపాల నిర్వాహకులకు ఉచిత విద్యుత్ సౌకర్యం అందడం వల్ల ఉత్సవాల నిర్వహణలో భక్తులకు కొంత ఆర్థిక భారం తగ్గనుంది.
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!