Site icon NTV Telugu

AP Free Bus: ఉచిత బస్సు ప్రయాణంపై రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ కీలక వ్యాఖ్యలు..

Free Bus

Free Bus

AP Free Bus Scheme: ఉచిత బస్సు ప్రయాణంపై రోడ్డు రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. త్వరలో ఉచిత బస్సు పథకానికి మంచి పేర్లు పెడతామన్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు అవుతోంది.. ఆయా రాష్ట్రాల్లో అమలువుతున్న విధంగానే ఏపీలోనూ పథకాన్ని అమలు చేస్తామన్నారు. సూపర్ సిక్స్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అతి ముఖ్యమైన పథకమన్నారు. అన్ని పథకాల కంటే ఎక్కవ లబ్ధిదారులు ఉండే పథకం ఇదే అన్నారు.. ఇందుకు తాజాగా కొత్త బస్సులు కొనుగోలు చేశామని తెలిపారు. చాలా వాటికి మరమ్మతులు చేపట్టామని వెల్లడించారు. ఏసీ ఉచిత బస్సు ప్రయాణం సూపర్ సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాను మంత్రి అయ్యాక 1200 బస్సులు కొన్నట్లు చెప్పారు.

READ MORE: Mallikarjun Kharge: ట్రంప్ వాదనలను మోడీ ఎందుకు ఖండించడం లేదు..? ఖర్గే ప్రశ్న..

ఇక.. వచ్చే 15 నుంచి ఏపీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు కానుంది. పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం ఆర్టీసీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. ఫ్రీ బస్సు పథకంతో ప్రజలకు ఎలా లబ్ధి కలుగుతుందో తెలిపేలా జీరో ఫేర్ టిక్కెట్ విధానాన్ని తీసుకురావాలని సూచించారు. మహిళా ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు?.. టిక్కెట్ ధర ఎంత?.. ప్రభుత్వం ఎంత మేర రాయితీ ఇస్తోంది?.. అనే సమాచారం స్పష్టంగా ఉండాలన్నారు. అవసరమైన సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.

READ MORE: Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. 7 గేట్లు ఎత్తివేత

Exit mobile version