NTV Telugu Site icon

KTR Birthday: మంత్రి కేటీఆర్ బర్త్‌డే స్పెషల్‌.. విద్యార్థినులకు ఉచిత బస్ పాసులు పంపిణీ చేసిన శ్రీ గణేష్

Ganesh

Ganesh

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో మారేడుపల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ రోజు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి జన్మదినం సందర్బంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏడాది పాటు 500 మందికి ఉచిత బస్ పాసులు పంపిణీ చేసారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ గణేష్ ….ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదరికం వలన ఎవరూ కూడా విద్యకు దూరం కావద్దని అన్నారు. నగరంలో చాలా దూరం నుండి మారేడుపల్లి పాఠశాలకు విద్యార్థులు వస్తున్నారని, వారికీ బస్ పాసులు తీసుకోవడం ఆర్థికంగా ఇబ్బంది అవుతున్నట్లు పాఠశాల నిర్వాహకులు తమ ద్రుష్టికి తీసుకు వచ్చారని, వెంటనే తమ ఫౌండేషన్ ద్వారా బస్ పాసులు పంచడానికి ఆర్టీసీ అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేశామన్నారు.

తాను కూడా పేదరికం నుండి వచ్చానని, పేదవారి కష్టాలు తనకి తెలుసు అని అన్నారు. కేటీఆర్ గారికి కూడా తన జన్మదినం సందర్బంగా హంగులు, ఆర్బాటాలు నచ్చవని, ప్రజలకు సేవ చేయడమే ఆయనకు ఇష్టం అని తెలిపారు. నాయకులు అందరూ కూడా పేదవారికి ఏదో ఒక సేవ చేయాలనీ సూచించారు. పాఠశాలలో బోర్ వెల్ సమస్య ఉందని, యాజమాన్యం వారు తెలపగా, బోర్ వెల్ కోసం తనవంతు సహాయం అందిస్తానని తెలిపారు. పిల్లలు విహార యాత్రకు వెళ్ళడానికి కూడా కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తానని అన్నారు శ్రీ గణేష్. ఈ సందర్బంగా పాఠశాల యాజమాన్యం శ్రీ గణేష్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ మనోహర చారీ, స్కూల్ ఇంచార్జి అనురాధ, యూసఫ్, డిపో మేనేజర్ రామ్మోహన్ తో పాటు ఇతర ఆర్టీసీ అధికారులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు…

ఖాకాగూడాలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ
ఐటి మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఖాకాగూడాలోని కమ్యూనిటీ హాల్ లో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే కుటుంబం ఎదుగుదల సాధ్యమవుతుందని శ్రీ గణేష్ అన్నారు.