Site icon NTV Telugu

France Protests: నేపాల్ తర్వాత.. నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్‌..

France

France

France Protests – Block Everything: నేపాల్ తర్వాత.. ఇప్పుడు ఫ్రాన్స్‌లో ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధుల్లోకి వచ్చారు. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. రాజధాని పారిస్‌లో నిరసన కారులను నియంత్రించడానికి పోలీసులు కాల్పులు జరుపుతున్నారు. ప్రజలు పోలీసులపై రాళ్లు రువ్వుతున్నారు. ఫ్రాన్స్ ప్రజలు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు వ్యతిరేకంగా నిరసన మిన్నంటాయి. మాక్రాన్ ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఏమీ చేయడం లేదని.. దేశ ఆర్థిక నిర్వహణ చాలా దరిద్రంగా ఉందని నిరసనకారులు చెబుతున్నారు.

READ MORE: TG News: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నియామకం.. ఈ తొమ్మిది ఉద్యోగ సంఘాలకు గుర్తింపు…

ఈ నిరసనలు సోషల్ మీడియాలో ‘Block Everything’ అనే పిలుపుతో ప్రారంభమయ్యాయి. ఒక్కసారిగా జనాలు రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. వేలాది మంది పోలీసులు నిరసనకారులను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వారికి సాధ్యం కావడం లేదు. ఫ్రాన్స్ అంతటా నిరసనకారులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు. చెత్త డబ్బాలను తగలబెట్టారు. అనేక చోట్ల పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. నిరసనకారులు కార్యకలాపాలను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. వీలైనంత త్వరగా అన్ని సర్దుమనిగేలా దేశవ్యాప్తంగా భద్రతా దళాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. డజన్ల కొద్దీ నిరసనకారులను అరెస్టు చేసినట్లు చెబుతున్నారు.

Exit mobile version