Foxtail Millet Idli Recipe: ప్రస్తుత రోజుల్లో సిరిధాన్యాలు (మిల్లెట్స్) ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని అందరూ వాటిని ఆహారంగా తీసుకోవడం మొదలు పెట్టారు. ఇది ఇలా ఉండగా సాధారణ బియ్యంతో చేసే ఇడ్లీలకు బదులుగా మిల్లెట్స్‌తో చేస్తే చాలా బాగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా కొర్రలు (Foxtail Millet) తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తాయి. అంతేకాదు బరువు తగ్గడానికి కూడా సూపర్ ఫుడ్ గా పనిచేస్తుంది.
మరి రైస్ పూర్తిగా లేకుండా కేవలం కొర్రలతోనే మృదువైన, స్పాంజీ ఇడ్లీలు ఎలా చేయాలో చూద్దాం. ఈ ఇడ్లీలు సాధారణ ఇడ్లీల కంటే ఎక్కువ పోషకాలు ఇస్తాయి. అలాగే టేస్ట్‌లో కూడా ఏమాత్రం తక్కువ ఉండవు. మరి ఈ కొర్ర ఇడ్లీలను ఎలా చేయాలో చూసేద్దామా..
అమెజాన్ సేల్‌లో Xiaomi ధమాకా…! Best 55-inch TV Under 35k.. ఇలాంటి డీల్ మళ్ళీ రాదు.!
కావలసిన పదార్థాలు:
కొర్రలు (Foxtail Millet) – 2 కప్పులు.
మినప్పప్పు (Urad Dal) – 1 కప్పు.
మెంతులు (Fenugreek seeds) – 1 టీస్పూన్.
ఉప్పు – రుచికి తగినంత.
తయారీ విధానం:
కొర్రలు, మినప్పప్పు, మెంతులను వేర్వేరుగా 6-8 గంటలు (లేదా రాత్రంతా) నీటిలో నానబెట్టండి. వీటిని నీటిలో బాగా నానాలి. నానబెట్టిన మినప్పప్పును మెత్తగా గ్రైండ్ చేయండి. (ఇడ్లీ రవ్వలా కాస్త బరకగా). తర్వాత కొర్రలను కొద్దిగా నీరు జోడించి మెత్తగా గ్రైండ్ చేయండి. రెండింటినీ కలిపి, ఉప్పు వేసి బాగా కలపండి. పిండి సాధారణ ఇడ్లీ పిండి లాగా ఉండాలి. అంటే ఎక్కువ లూస్ కాకుండా, గట్టిగా కాకుండా ఉండేలా చూసుకోవాలి.
Edupayala Jatara Dates : ఏడుపాయల మహాజాతర.. ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు బ్రహ్మోత్సవాలు..
అలా చేసిన పిండిని 8-10 గంటలు (వాతావరణం బట్టి) వెచ్చని చోట పులించనివ్వండి. పులిసిన తర్వాత పిండి పొంగి రెట్టింపు అవుతుంది. అలా వచ్చిన పిండిని ఇడ్లీ స్టీమర్ లో నీరు మరిగేలా పెట్టండి. ఇడ్లీ ప్లేట్స్‌కు నూనె రాసి, పిండిని పోసి 10-12 నిమిషాలు స్టీమ్ చేయండి. ఇంకేముంది హెల్తి కొర్ర ఇడ్లీలు రెడీ. వీటిని వేడివేడిగా సాంబార్, చట్నీ, మిరప పొడితో కలిపి తినండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీని ట్రై చేసి మీ అనుభవం కామెంట్స్‌లో షేర్ చేయండి.
