Family Drowned in Kotipally Project: వికారాబాద్ జిల్లాలో పండుగపూట విషాదం చోటుచేసుకుంది. విహారయాత్ర కోసం కోటిపల్లి ప్రాజెక్టుకు వెళ్లిన నలుగురు గుల్లంతు కాగా.. ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారు ఈతకు దిగి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఒడ్డున ఈదుతూ ప్రమాదవశాత్తూ మునిగిపోయారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతిచెందారు.
CM K.ChandraShekar Rao: మంత్రి గంగుల కమలాకర్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్
పూడూరు మండలం మన్నెగూడ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు కోటిపల్లి ప్రాజెక్టుకు విహారయాత్రకు వచ్చారు. ప్రాజెక్టులో నలుగురు గల్లంతై మృతి చెందగా… ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొక వ్యక్తి కొరకు గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు లోకేశ్, వెంకటేష్, జగదీశ్, రాజేశ్‌లుగా గుర్తించారు. . పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఘటనపై మంత్రి సబితా రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
కోట్ పల్లి చెరువు దగ్గర జరిగిన సంఘటన పట్ల విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. వికారాబాద్ జిల్లా మన్నెగూడ ప్రాంతానికి చెందిన వారి విహార యాత్ర విషాదంగా మారటం ఎంతో బాధ కలిగించిందని వారి కుటుంభ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. విషయం తెలిసిన వెంటనే వారి ఆచూకీ కోసం గాలించాలని,పోలీసులకు అదేశించిట్లు తెలిపారు. నాలుగు మృతదేహాలు లభించాయని,వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన వారు ఈ దుర్ఘటనలో మృతి చెందడం అత్యంత బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. సంఘటనపై వికారాబాద్, పరిగి ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్, ఎస్పీలతో మంత్రి మాట్లాడారు.