Site icon NTV Telugu

Kerala : లోయలో పడిన టూరిస్ట్ బస్సు.. కేరళలో ఘోరం

New Project (6)

New Project (6)

Kerala : కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు లోయలో పడి నలుగురు చనిపోయారు. మృతిచెందిన వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగేలా ఉంది. తమిళనాడు తిరునల్వేలికి చెందిన కొందరు కేరళ మునార్ ప్రాంతంలోని టూరిస్ట్ ప్లేస్ లను చూసేందుకు బస్సులో బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న బస్సు కేరళలోని ఇడుక్కి-కొచ్చి జాతీయ రహదారిపై ప్రమాదానికి గురయ్యింది.

Read Also: Custody: ఈ ఒక్క సాంగ్ తో మూవీ కలర్ మారిపోయింది…

హైవేపై వేగంగా వెళుతూ అదుపుతప్పి బస్సు లోయలో పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలపాలైన చిన్నారితో సహా నలుగురు స్పాట్లోనే చనిపోగా మరో 16మందికి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. తక్షణమే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని కాపాడి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిలో ఇద్దరు వళళియమ్మాల్, పెరుమాల్ గా గుర్తించారు. ఈ రోడ్డు ప్రమాదం ఘటన పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also:Ashwini Choubey : కనిపిస్తే కాల్చేయాలి.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

Exit mobile version