NTV Telugu Site icon

Tirupati Bypoll: తిరుపతి లోక్‌సభ బై పోల్‌ ఎపిసోడ్‌.. మరో అధికారిపై వేటు..

Cec

Cec

Tirupati Bypoll: తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో అక్రమాల ఎపిసోడులో మరో వికెట్ పడినట్టు అయ్యింది.. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డిని సస్పెండ్ చేసింది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) సూచనల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మీ.. అయితే, ఓటర్ కార్డుల డౌన్ లోడ్ స్కాంలో చంద్రమౌళీశ్వర రెడ్డిని బాధ్యుడిగా గుర్తించింది సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ (సీఈసీ).. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరుగా బాధ్యతలు నిర్వహించారు చంద్రమౌళీశ్వర రెడ్డి.. ఇక, ఓటర్ కార్డుల డౌన్ లోడ్ స్కాంలో ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా సస్పెండ్‌ అయిన విషయం విదితమే.

Read Also: Revanth Reddy: బీఆర్ఎస్‌పై నిప్పులుచెరిగిన సీఎం రేవంత్

ఇక, ఎవరు నియమించకుండానే తనకు తానే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ఈఆర్వోగా చంద్రమౌళీశ్వ రెడ్డి వ్యవహరించినట్టు అభియోగాలు ఉన్నాయి.. ప్రస్తుతం మెప్మా అడిషనల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు చంద్రమౌళీశ్వర రెడ్డి. బై పోల్‌ సమయంలో జరిగిన వ్యవహారాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించిన సీఈసీ. పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది.. అయితే, తిరుపతి బైపోల్‌ సమయంలో గిరీషా.. తిరుపతి కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేశారు.. ఎన్నికల సందర్భంగా దొంగ ఓట్లు వేసుకునేందుకు సాయం చేశారన్న ఆరోపణలతో ఆయనపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డిపై చర్యలు తీసుకుంది.. తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా గిరీషా.. లాగిన్ ఐడీని ఎవరు ఎందుకు దుర్వినియోగం చేశారన్న కోణంలో విచారణ జరిగింది.. ఈ విచారణలో గిరీషా లాగిన్ ఐడీ ద్వారా 30 వేలకుపైగా ఎపిక్‌ కార్డుల్ని అక్రమంగా డౌన్‌లోడ్ చేసినట్టు గుర్తించిన సీఈసీ చర్యలకు పూనుకున్న విషయం విదితమే.