NTV Telugu Site icon

మంత్రి వర్గానికి సినిమా టిక్కెట్ల అమ్మకాలే ముఖ్యమా..?: మాజీ ఎమ్మెల్యే


ఇవాళ జరిగిన ఏపీ కేబినేట్‌ మీటింగ్‌లో చర్చించిన అంశాలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలపై కెబినెట్లో ఎందుకు చర్చించ లేదు..? మాదకద్రవ్యాలు, గంజాయి ప్రస్తావన రాగానే దేశమంతా ఏపీ పేరే వినిపిస్తుంటే, కేబినేట్‌కు మాత్రం వినపడలేదన్నారు. ? లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఎయిడెడ్ విద్యాసంస్థలపై మంత్రివర్గం ఎందుకు చర్చించలేదు..?

విశాఖలో స్వామీజీ ఆశ్రమానికి రైతులభూములు తక్కువ ధరకు అప్పగించడానికే ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించిందా? అని తెనాలి శ్రావణ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు 6 గంటల విద్యుత్ ఇస్తూ, 9గంటలు ఇవ్వడానికి యూనిట్ రూ.2.49పైసలకు కొంటున్నామని చెప్పడం ఏమిటి? రాష్ట్రంలో థర్మల్, జలవిద్యుత్ ఉత్పత్తికి విఘాతంకలిగించి, ప్రజలపై భారంవేసి, ఇప్పుడు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి రూ. 7 వేలమెగావాట్లు కొంటామని చెప్పడం సిగ్గుచేటుగా ఉందన్నారు. గతంలో చంద్రబాబునాయుడు హయాంలో రూ.70వేలకోట్లతో ఏపీలో ఆదానీ సెంటర్ నెలకొల్పడానికి ఒప్పందం జరిగితే, ఆప్రాజెక్ట్ ను రాష్ట్రంనుంచి ఎందుకు పంపించారో జగన్‌ చెప్పాలని శ్రావణ్‌కుమార్‌ అన్నారు.

ఈ ప్రభుత్వం రూ.14,600కోట్ల అదానీ ప్రాజెక్ట్ ను తీసుకొస్తున్నామని చెప్పడంలోని మర్మమేమిటో పాలకులు చెప్పాలని విమర్శించారు. వైసీపీప్రభుత్వం గతంలో టీడీపీ ప్రభుత్వంలో జరిగిన వాటిని తప్పుపట్టిందో, ఇప్పుడు వాటిపైనే కేబినెట్‌లో చర్చిందన్నారు. జైన్, సిక్కు కార్పొరేషన్ సహా, రాష్ట్రంలో ఎన్నికార్పొరేషన్లు పెడతారో, పెట్టినవాటికి నిధులు, విధులు ఏమిఉన్నాయో, వాటి చిరునామాలు ఎక్కడో పాలకులు తెలియపర్చాల్సిన అవసరం ఉందని శ్రావణ్‌కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Show comments