Site icon NTV Telugu

Kethireddy Pedda Reddy: మీరేం చేయాలో అది చేయండి.. తాడిపత్రి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి!

Kethireddy Pedda Reddy

Kethireddy Pedda Reddy

Kethireddy Pedda Reddy: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు నగరానికి చేరుకున్నారు. తన ఇంటి వద్ద మునిపల్ అధికారులు చేపట్టిన సర్వేను ఆయన పరిశీలించారు. తన ఇళ్లు, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లబు ఆయన అధికారులకు అందచేశారు. తన ఇంటి స్థలంలో మునిసిపల్ స్థలం ఆక్రమించలేదని ఆయన అధికారులకు తెలిపారు. నా ఇంటికి ప్లానింగ్ ఉందో లేదో అధికారులే తెలియజేయాలని ఆయన అన్నారు. సర్వేలో 1వ ఫ్లాట్ నుంచి 16 ఫ్లాట్ వరకు సర్వే చేయాలని.. ప్రతి ఒక్క నివేదికను నాకు కచ్చితంగా అందజేయాలని ఆయన అధికారులను కోరారు.

Son Kills Mother: దారుణం.. తల్లిన హత్య చేసిన కొడుకు..

ఇక సర్వ్ తర్వాత మున్సిపాలిటీ స్థలం ఎంత ఉన్నది తనకు నివేదిక అందించాలని ఆయన మునిలోపల్ అధికారులను కోరారు. మీరు ఎక్కడి నుంచి కొలిచిన ఇరువైపులా కొలతలు వేయాలని.. మీరు కొలతలు వేసిన తరువాత రాతపూర్వకంగా నివేదిక అందిస్తే నేను ఏం చేయాలో అది చేస్తా అంటూనే.. మీరేం చేయాలో అది చేయండని అధికారులతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు.

Prabhas : అప్పుడు కన్నప్ప.. ఇప్పుడు మిరాయ్.. కరుణామయుడు రెబలోడు

Exit mobile version