Site icon NTV Telugu

Jayaprada: కోర్టులో లొంగిపోయిన జయప్రద

Jaya

Jaya

సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద (Jayaprada) ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కోర్టులో లొంగిపోయారు. గత ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణకు ఆమె హాజరు కాకపోవడంతో ఆమెకు కోర్టు నోటీసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. అయినా ఆమె ఆమె స్పందించలేదు. ఫిబ్రవరి 27న ఆమెకు సీఆర్పీసీ 82 కింద మరో నాన్ బెయిలబుల్ వారెంట్‌ను రాంపూర్ లోని ఎంపీ / ఎమ్మెల్యే కోర్టు జారీ చేసింది. వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. జయప్రద పరారీలో ఉన్నట్టు కూడా కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జయప్రద సోమవారం కోర్టులో లొంగిపోయారు.

జయప్రద సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ రాణించారు. మంచి పేరును సంపాదించుకున్నారు. అయితే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ న్యాయపరంగా చిక్కుల్లో చిక్కుకున్నారు. రెండు కేసుల్లో ఆమె విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆమెకు న్యాయస్థానం నాన్‌బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసింది. మొత్తానికి సోమవారం రాంపూర్‌ ధర్మాసనం ముందు లొంగిపోయారు.

Exit mobile version