NTV Telugu Site icon

Former CM: మాజీ సీఎం కాన్వాయ్‌లో కారు బోల్తా.. పరిస్థితి ఎలా ఉందంటే?

Former Cm

Former Cm

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజే కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న పోలీసు వాహనం బోల్తా పడడంతో నలుగురు పోలీసులు గాయపడ్డారు. పాలీ జిల్లాలోని రోహత్, పానిహరి కూడలి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బైక్ రైడర్‌ను రక్షించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో పోలీసు బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. కేబినెట్ మంత్రి ఒట్టారామ్ దేవాసి తల్లి ఇటీవల మరణించగా.. ఆయన్ని పరామర్శించడానికి వసుంధర రాజే పాలి జిల్లాలోని బాలికి వెళ్లారు.

READ MORE: High Tension in Tenali: తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఉద్రిక్తత

ఈ ప్రమాదం అనంతరం ఆమె వెంటనే కిందకు దిగారు. గాయపడిన పోలీసుల పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, పరిపాలనా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.గాయపడిన పోలీసులను అంబులెన్స్‌లో బాలి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో మాజీ ముఖ్యమంత్రికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

READ MORE: West Bengal: కీలక ఉగ్రవాది అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..