Site icon NTV Telugu

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఇంగ్లాండ్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ ప్రశంస‌లు

Cm Revanth

Cm Revanth

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇంగ్లాండ్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ ప్రశంస‌లు కురిపించారు. తెలంగాణ రైజింగ్-2047పై సీఎం రేవంత్ రెడ్డిని టోనీ బ్లెయిర్ ప్రశంసించారు. రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా అభినంద‌న‌లు తెలిపాడు టోనీ బ్లెయిర్‌. ఇటీవ‌ల ఢిల్లీలో టోనీబ్లెయిర్‌తో రేవంత్ రెడ్డి స‌మావేశ‌మయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ తెలంగాణ రైజింగ్ విజ‌న్‌-2047 గురించి టోనీబ్లెయిర్‌కు వివ‌రించారు. తెలంగాణ రైజింగ్ విజ‌న్‌-2047లో నిర్దేశించుకున్న 3 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఎకాన‌మీ, పెట్టుబడుల సాధ‌న‌, రైతులు, మ‌హిళా, యువ సాధికారిత‌, మౌలిక వ‌స‌తుల క‌ల్పన, ఐటీ, ఇత‌ర రంగాల అభివృద్ధి ల‌క్ష్యాల‌ను, చేరుకునే మార్గాల‌ను వివ‌రించారు.

Also Read:Crime News: మరో ఘటన.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..

తెలంగాణ రైజింగ్ విజ‌న్ రూప‌క‌ల్పన… అమ‌లుకు సంబంధించి లెట‌ర్ ఆఫ్ ఇంటెంట్ మార్చుకున్నారు టోనీ బ్లెయిర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్లోబ‌ల్ ఛేంజ్ (TBIGC), తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు. తెలంగాణ రైజింగ్ విజ‌న్‌-2047లోని స్పష్టత‌… నిర్దేశించుకున్న ల‌క్ష్యాలు ఎంతో ఆక‌ట్టుకున్నాయంటూ టోనీబ్లెయిర్‌ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ రైజింగ్ విజ‌న్‌-2047లో నిర్దేశించుకున్న ల‌క్ష్యాల సాధ‌న‌కు ఇండియాలోని (TBIGC) ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వానికి స‌హ‌క‌రిస్తార‌ని టోనీ బ్లెయిర్‌ తెలియ‌జేశారు.

Also Read: Crime News: మరో ఘటన.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..

ఈ క్రమంలో సీఎంవోకు ఏవైనా సందేహాలు ఉంటే ఎటువంటి సంకోచాలు లేకుండా త‌మ TBIGC భార‌త ప్రతినిధిని సంప్రదించాలని సీఎం రేవంత్ రెడ్డికి టోనీబ్లెయిర్‌ సూచించారు. తెలంగాణ రైజింగ్ విజ‌న్‌-2047 డాక్యుమెంట్ ఆవిష్కరణకు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నట్లు టోనీబ్లెయిర్‌ తెలిపారు.

Exit mobile version