Site icon NTV Telugu

Viral Video: చంద్రయాన్-3పై పాకిస్థాన్ మాజీ మంత్రి ఫన్నీ కామెంట్స్.. వీడియో వైరల్

Chandra Video

Chandra Video

జులై 14న జాబిల్లిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్- 3 రాకెట్ విజవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విషయం అందరికి తెలిసిందే. అయితే చంద్రయాన్-3 నింగిలోకి వెళ్లే ముందు అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికీ ఆ ట్రెండ్ కొనసాగుతోంది. మరోవైపు చంద్రయాన్-3 ఆకాశంలో ఎగురుతున్న దృశ్యాన్ని వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు తమ కెమెరాల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా రకరకాలుగా చంద్రయాన్-3పై సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ చేస్తున్నారు. అయితే తాజాగా చంద్రయాన్-3 కు సంబంధించి మరొక వైరల్ న్యూస్ బయటికొచ్చింది. పాకిస్తాన్ మాజీ మంత్రికి సంబంధించిన ఒక ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చంద్రయాన్-3 గురించి మాట్లాడి కడుపుబ్బా నవ్విస్తాడు.

Mobile Charger: మీ మొబైల్ ఫోన్ కి వేరే ఛార్జర్ తో ఛార్జ్ చేస్తున్నారా..?

ఆ మాజీ పాకిస్తాన్ మంత్రి పేరు ఫవాద్ చౌదరి. అతను తన వింత ప్రకటనల గురించి తరచుగా చర్చలో ఉంటాడు. ప్రస్తుతం.. వైరల్ అవుతున్న అతని వీడియోలో అతను న్యూస్ డిబేట్‌లో కూర్చుని చంద్రయాన్ -3 గురించి మాట్లాడుతున్నాడు. ఇంట్లో కూర్చున్న మనకు చంద్రుడు కనిపిస్తున్నప్పుడు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. అంత పాపడ్ రోల్ చేయాల్సిన అవసరం లేదని మంత్రి చెబుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఇంట్లో కూర్చున్న చంద్రుడిని చూడగలిగినప్పుడు.. దాని స్థానం మనకు తెలుసు, అప్పుడు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏమిటి? అని ఫన్నీగా మాట్లాడాడు.

Maamannan: తెలుగులో రిలీజయ్యి వారం కూడా కాలేదు.. అప్పుడే ఓటీటీలోకి!

ఈ వీడియో సోషల్ మీడియాలో చూసిన వెంటనే జనాలు నవ్వుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ఫన్నీ వీడియోపై ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ‘చంద్రయాన్‌ 3కి పాకిస్థాన్‌ తగిన సమాధానం’ అని కొందరు.. ‘ఇస్రో శాస్త్రవేత్తలకు ఎవరో చెబితే బాగుండేది’ అని కొందరు సరదాగా అంటున్నారు.

Exit mobile version