హాలీవుడ్‌లో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెలుగొందిన నటుడు టైలర్ చేజ్ ప్రస్తుతం దారుణ పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నాడు. చిన్న వయసులోనే పేరు, గుర్తింపు, క్రేజ్ అన్నీ సొంతం చేసుకున్న ఈ నటుడు నేడు లాస్ ఏంజిల్స్ వీధుల్లో అడుక్కుంటూ జీవిస్తున్నాడు అనే విషయం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Dhandoraa : సామాన్లు కనపడేలా డ్రెస్ వేసుకోవడం అందం కాదు : శివాజీ
2004 నుంచి 2007 మధ్యకాలంలో ప్రసారమైన ప్రముఖ అమెరికన్ టీవీ సిరీస్ ‘Neds Declassified School Survival Guide’ ద్వారా టైలర్ చేజ్ ఇంటింటా పేరు తెచ్చుకున్నారు. ఈ సిరీస్ అప్పట్లో పిల్లలు, టీనేజర్లకు విశేషంగా ఆకట్టుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ సమయంలో టైలర్ చేజ్‌ను భవిష్యత్ హాలీవుడ్ స్టార్ అవుతాడని అందరూ భావించారు. అనేక అవకాశాలతో హాలీవుడ్ లో స్టార్ గా వెలుగొందుతాడని అందరూ అనుకున్నారు. కానీ టైలర్ చేజ్ పరిస్థితి అందుకు పూర్తిగా బిన్నంగా మారింది. ఉండడానికి ఇల్లు లేక లాస్ ఏంజెల్స్ విధుల్లో అడుక్కుంటూ దుర్భర జీవనం సాగిస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చిన విజయాన్ని కొనసాగించడంలో టైలర్ చేజ్ విఫలమయ్యారు. సిరీస్ ముగిసిన తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడం, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టంగా మారడం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. కొన్ని చిన్న పాత్రలు చేసినా, అవి కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లలేకపోయాయి. తాజాగా బయటకు వచ్చిన వీడియోలలో టైలర్ చేజ్ ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ వీధుల్లో నివసిస్తూ, దారి వెంబడి సహాయం కోరుతున్నాడు. ఒకప్పుడు టీవీ స్క్రీన్‌పై స్టార్ మళ్లీ మంచి దారిలోకి రావాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
