NTV Telugu Site icon

Sugunamma broke down in tears: తిరుపతి సీటుపై పునరాలోచించాలి.. కన్నీటి పర్యంతమైన మాజీ ఎమ్మెల్యే

Sugunamma

Sugunamma

Sugunamma broke down in tears: తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయింపుపై పునరాలోచించుకోవాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మ.. తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని సుగుణమ్మకే కేటాయించాలంటూ స్థానిక టీడీపీ నేతలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోన్న విషయం విదితమే కాగా.. ఈ రోజు ఆమె మాట్లాడుతూ.. అహర్నిశలు టీడీపీ అభివృద్ధి కోసం పని చేశాను అన్నారు.. చంద్రబాబు సర్వేలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. ఎక్కడి నుంచో వచ్చిన వారికి మద్దతు పలకమంటే నేను అంగీకరించినా.. పార్టీ కేడర్ అంగీకరించడం లేదన్న ఆమె.. తిరుపతి అభ్యర్థిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పునరాలొచిస్తారని నమ్ముతున్నాను అన్నారు.

Read Also: SOT Attacks: సైబరాబాద్‌ లోని బల్ట్ షాప్‌ లపై ఎస్ఓటీ దాడులు..!

ఇక, టీడీపీ, జనసేన కీలక నేతలు తిరుపతి అసెంబ్లీ స్థానంపై పునరాలోచన చేయాలని డిమాండ్‌ చేశారు సుగుణమ్మ.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో అనునిత్యం పోరాటం చేశాం.. కానీ, ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వారికే టికెట్‌ కేటాయిస్తే జనం అంగీకరించడం లేదన్నారు.. తిరుపతిలో వైసీపీ నేతల ఆగడాలపై అడుగడుగునా ఎండగట్టాం అని గుర్తుచేసుకున్నారు.. అయితే, తనకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు.. తిరుపతికి మా కుటుంబం చేసిన పనులను గుర్తుచేశారు. ఇక, మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతం అయ్యారు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ.