Site icon NTV Telugu

Chevireddy Bhaskar Reddy: తుడా నిధుల దుర్వినియోగం ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే రియాక్షన్..!

Chevireddy Bhaskarreddy

Chevireddy Bhaskarreddy

తుడా నిధుల దుర్వినియోగం ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. తుడాలో నిబంధనలకు విరుద్ధంగా ఏమి చేయడానికి వీలు ఉండదని స్పష్టం చేశారు. తుడా ఛైర్మన్ కు సంతకం పెట్టే వీలు ఉండదని.. వీసీ, సెక్రటరీ, అథారిటీ చూసుకుంటుందని వెల్లడించారు. తుడాలో గతంలో ఏ రకమైన అవినీతి జరగలేదని పునరుద్ఘాటించారు. బెంచీలు గురించి తప్పుడు కథనాలు రాస్తున్నారన్నారు. వైజాగ్ లో వేసిన బెంచీలకు 15790 ఒక బెంచీకి ఖర్చు చేశారు. తర్వాత 8వేలకు చేశామని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గానికి ఎక్కువ నిధులు పెట్టింది నిజమే అని.. నా సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని స్పష్టం చేశారు. తుమ్మలగుంట చెరువులో అవిలాల చెరువును చంద్రబాబు గతంలో అభివృద్ధి చేయమంటే టీటీడీ చేసిందని చెప్పారు. అదే విధంగా చెరువు దురాక్రమణ కాకుండా అభివృద్ధి చేశామన్నారు. తాను చేసింది తప్పు అయితే… చంద్రబాబు చేసింది తప్పే అని అన్నారు..

READ MORE: Geeta Singh: సెకండ్ ఇన్నింగ్స్ మొదలెడుతున్న కితకితలు హీరోయిన్

తుడా ద్వారా జరిగిన అభివృద్ధి పది మందికి తెలియాలంటే విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూచించారు. ఛైర్మన్ గా పనిచేసినప్పుడు నోటీసులు వస్తాయని.. సమాధానం చెపుతామన్నారు. తనకు వ్యక్తిగతంగా కోపం లేకపోయినా కొన్ని పత్రికలు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని.. తప్పనిసరి పరిస్థితుల్లో లిగల్ నోటీసులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎంపీడీవోలకు నిధులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారని.. వేలల్లో పనులు ఉన్నప్పుడు సిబ్బంది కొరత కారణంగా మండలాలకు డబ్బులు ఇచ్చి పనులు చేయించానన్నారు. గతంలో పుట్టపర్తి డెవలప్మెంట్ కు తుడా నిధులు ఇచ్చిందని వెల్లడించారు.. గతంలో శ్రీకాళహస్తిలో పార్కును, నగరిలో, నారాయణవనం, స్వర్ణముఖిలో పార్కులను మున్సిపాలిటీలకు, పంచాయితీలకు ఇచ్చిన అంశం తెలియదా? అని ప్రశ్నించారు.

READ MORE: Piyush Chawla: అంతర్జాతీయ క్రికెట్‌కు మరో టీమిండియా ప్లేయర్ వీడ్కోలు..!

Exit mobile version