NTV Telugu Site icon

Bodige Galanna Passed Away: మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ కుటుంబంలో తీవ్ర విషాదం

Bodige Galanna

Bodige Galanna

Bodige Galanna Passed Away: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ భర్త, మాజీ పీపుల్స్ వార్ నేత గాలన్న గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు కరీంనగర్‌లో లైఫ్ లైన్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన సైదాపూర్ మండలం వెంకటేశ్వర్ల పల్లెకు బంధువులు తరలించారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. జనవరి 19వ తేదీ శుక్రవారం సాయంత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బొడిగె గాలన్న కన్నుమూశారు. దీంతో పలువురు రాజకీయ ప్రముఖులు గాలన్న మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆయన మృతిపై సంతాపం తెలిపారు. బొడిగె గాలన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం నుంచి పని చేశారని, శంకరపట్నం జడ్పీటీసీగా, చొప్పదండి ఎమ్మెల్యేగా పనిచేసిన తన సతీమణి శోభక్కకు అండగా ఉండి పనిచేసారని వినోద్‌కుమార్ గుర్తు చేశారు. బొడిగె గాలన్న చిన్నతనం నుంచే పేదప్రజల సమస్యలపై పోరాటం చేశారని ఆయన తెలిపారు. వామపక్ష పార్టీలలో పని చేశారని, గాలన్న మృతి తీరని లోటన్నారు.