Ambati Rambabu: నేడు సత్తెనపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరు అయ్యారు మాజీ మంత్రులు విడదల రజినీ, అంబటి రాంబాబు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో అంబటిని, జగన్ పర్యటన సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన కేసులో విడదల రజినీని విచారించారు పోలీసులు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. సత్తెనపల్లి పిఎస్ లో విచారణకు హాజరయ్యాం. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పామన్నారు. జగన్ కేబినేట్ లో మంత్రులుగా చేశాం. అయినా చంద్రబాబు, లోకేష్ పనిగట్టుకుని మాపై కేసులు పెట్టిస్తున్నారని, జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుండి అయన వెంటే వెలుతున్నామని అన్నారు. గతంలో ఎప్పుడూ కేసులు పెట్టిన దాఖలాలు లేవని, మాపై కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారన్నారు. కూటమీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని, వైసీపీ నేతలందరిపై కేసు పెట్టి లోపలెయ్యాలని చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మిథున్ రెడ్డిని అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. పరిపాలన ఏవిదంగా సాగుతుందో ప్రజలు ఆలోచించాలని ఆయన అన్నారు.
Pawan Kalyan : నా గత సినిమాలను అప్పటి ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టింది
సత్తెనపల్లి శాసన సభ్యులు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. కాంట్రాక్టర్ దగ్గర చేతులు కట్టుకొని నిలబడుతున్నారు. ఆ కాంట్రాక్టర్ వివాదాల్లో ఉన్న స్థలాలు కొని వెంచర్లు వేస్తున్నాడని అన్నారు. లిక్కర్ స్కాం చంద్రబాబు, లోకేష్, మంత్రులు, డిఎన్ఆర్ చేస్తున్నారని ఆయన అన్నారు. పోస్ స్టేషన్ కు హాజరుకావడం బిడియంగా ఉందని, దేనికైనా సిద్ధపడి రాజకీయాలు చేస్తాంమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు లోకేష్ కు బుద్ది చెప్పి తిరుతామని, ఇది మిలటరి పాలనని.. దుష్ట పాలన అంతానికి అందరం కలిసి పని చేద్దామని వ్యాఖ్యానించారు.
